ఐపీఎల్ 2025: ఈ 5 మంది ఆటగాళ్లపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

First Published | Nov 10, 2024, 11:27 AM IST

IPL 2025 Auction Sunrisers Hyderabad : కావ్య మారన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెగా వేలం ముందు 5 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇప్పుడు మెగా వేలంలో మరికొంత మంది టీ20 స్పెషలిస్ట్‌లను కొనుగోలు చేయాలని చూస్తోంది. కావ్య మారన్ కన్నేసిన ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

IPL వేలం 2025 నవంబర్ 24, 25 తేదీలలో జెడ్డాలో జరగబోతోంది. ప్రతి ఫ్రాంచైజీకి తదుపరి మూడు సీజన్ల కోసం ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌నున్నాయి. గ‌త ఐపీఎల్ ఫైనలిస్ట్ అయిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) వేలానికి ముందు ఆ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్లు హెన్రిచ్ క్లాసెన్ , పాట్ కమ్మిన్స్ , అభిషేక్ శర్మ , ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డిలను 75 కోట్ల భారీ ప్రైజ‌న్ మ‌నీతో రిటైన్ చేసుకుంది. వారిలో స్క్వాడ్ లో  6 మంది భారతీయ ఆటగాళ్లతో నింపడానికి వారి పర్స్‌లో కేవలం 45 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో రాబోయే వేలంలో ఐదురుగు ప్లేయ‌ర్ల‌పై క‌న్నేసింది. ఆ వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 

1. టీ. నటరాజన్

ఎడమచేతి వేసే నటరాజన్‌ను సర్ రైజర్స్ వేలంలోకి వదిలిపెట్టింది. గత ఐపీఎల్‌ సీజన్ లో అతను 19 వికెట్లు తీశాడు. దీంతో నటరాజన్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని హైదారాబాద్ టీమ్ చూస్తోంది. తమిళనాడుకు చెందిన ఈ లెఫ్టార్మ్ మీడియం-పేసర్ దేశ‌వాళీ క్రికెట్ లో త‌న‌మైన ముద్ర వేశాడు. మ‌రీ ముఖ్యంగా T20 సర్క్యూట్‌లో తన బౌలింగ్ సామర్థ్యాలతో ప్రసిద్ధి చెందాడు. 2017లో కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) చేత అత్యధిక పారితోషికం పొందిన‌ అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా కూడా ఉన్నాడు. 2020 ఐపీఎల్ ఎడిషన్‌లో నటరాజన్ 16 గేమ్‌లలో 16 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. దీని త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.


2. వెంకటేష్ అయ్యర్

కోల్ కతా నైట్ రైడర్స్  (కేకేఆర్) వదులుకున్న  వెంకటేష్ అయ్యర్‌ను దక్కించుకోవాలని సన్ రైజర్స్ హైదరారాబాద్ (SRH) చేస్తోందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మంచి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కోసం చూస్తున్న SRHకి అయ్యర్ మంచి ఆప్షన్ కూడా. గత సీజన్ లో కేకేఆర్ కోసం మంచి ఇన్నింగ్స్ లను కూడా ఆడాడు. 

వెంకటేష్ అయ్యర్ దేశ‌వాళీ క్రికెట్ లో అద్భుత రికార్డులు సాధించాడు. ఈ మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ తన హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్, అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో బౌలింగ్‌తో చాలా పేరు తెచ్చుకున్నాడు. T20 బ్యాటింగ్ స్ట్రైక్-రేట్ 137.64 అతని హిట్టింగ్ సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో కేకేఆర్ కోసం ఆడి 370 పరుగులు చేశాడు.   
 

3. మహమ్మద్ సిరాజ్

2015-17లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడిన మహ్మద్ సిరాజ్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలను కూడా హైదరాబాద్ టీమ్ పరిశీలిస్తోందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడిన  సిరాజ్ ను ఐపీఎల్ మెగా వేలానికి ముందు అతన్ని వదులుకుంది. దీంతో వేలంలోకి వచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో సిరాజ్ ఆర్సీబీ తరఫున 15 వికెట్లు పడగొట్టాడు. 

4. రవిచంద్రన్ అశ్విన్

కెరీర్ చివరి దశలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు రిటైన్ చేసుకోకుండా వదులుకుంది. దీంతో వేలంలోకి వచ్చిన భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ ను కోనుగోలు చేయడానికి కూడా  హైదరాబాద్ టీమ్ ఆసక్తిగా ఉంది.

అశ్విన్ ఐపీఎల్ కెరీర్ ను గ‌మ‌నిస్తే 212 మ్యాచ్ ల‌ను ఆడిన అత‌ను 180 వికెట్లు తీసుకున్నాడు. 4/34    వికెట్ల‌తో బెస్ట్ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదుచేశాడు. ఐపీఎల్ 2024 లో రాజ‌స్థాన్ త‌ర‌ఫున ఆడిన అశ్విన్ 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అలాగే, 3/24 వికెట్ల బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదుచేశాడు. 

5. అబ్దుల్ సమద్

2020 నుంచి SRH తరఫున ఆడుతున్న సమద్‌ను జట్టు వదిలేసింది. తక్కువ ధరకే తిరిగి కొనుగోలు చేయాలని చూస్తోంది. జమ్మూ & కాశ్మీర్‌కు చెందిన 23 ఏళ్ల అబ్దుల్ సమద్ 2020లో IPL అరంగేట్రం చేసాడు. అప్పటి నుండి అతను SRHలో ఉన్నాడు. ఫ్రాంచైజీ అతనిని 2023లో రిటైన్ చేసుకుంది. అయితే, తుది జ‌ట్టులో చోటుద‌క్క‌లేదు కానీ, 2024 సీజ‌న్ లో టీమ్ తో అన్ని మ్యాచ్ ల‌ను ఆడాడు. సమద్ IPL 2024లో 168.51 స్ట్రైక్ రేట్‌తో 16 ఇన్నింగ్స్‌లలో 182 పరుగులు చేశాడు. మొత్తం 50 ఐపీఎల్ మ్యాచ్ ల‌లో అత‌ను 146.07 స్ట్రైక్ రేట్‌తో 577 పరుగులు చేశాడు. అతను ఫినిషర్ గా మంచి గుర్తింపు పొందాడు. హైద‌రాబాద్ ఫ్రాంచైజీ సమద్ ను RTM కార్డుతో ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది.

Latest Videos

click me!