ఐపీఎల్ 2025 వేలం : ఈ సారి IPL వేలంలో స‌రికొత్త‌గా ఏమి ఉండ‌నుంది? మ‌నీ-స్లాట్స్-RTM... పూర్తి వివ‌రాలు ఇవిగో

First Published | Nov 10, 2024, 10:31 AM IST

IPL Auction 2025 Full Details: ఐపీఎల్ 2025 వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతుంది. విదేశాల్లో నిర్వ‌హించ‌డం ఇది రెండవసారి. 2024 వేలం దుబాయ్‌లో జరిగింది. ఐపీఎల్ 2025 వేలంలో కనిపించే కొత్త విష‌యాలు, ఇత‌ర‌ వివ‌రాలు మీకోసం.
 

IPL Auction 2025

IPL Auction 2025 Full Details:  ప్రపంచ క్రికెట్ లో అతిపెద్ద టీ20 లీగ్ అయిన‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆటగాళ్ల వేలం నవంబర్ 24, 25 తేదీలలో జ‌ర‌గ‌నుందని స‌మాచారం. మొత్తం 10 టీమ్‌లు తమ సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఇప్ప‌టికే ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు అందరి దృష్టి ఆట‌గాళ్ల‌ మెగా వేలం వైపే ఉంది. ఇందుకోసం బీసీసీఐ కూడా సిద్ధమైంది. ప్రస్తుత సెక్రటరీ జే షా పదవీకాలం నవంబర్ 30తో ముగియనుండడంతో డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టనున్నారు. దీంతో రాబోయే ఐపీఎల్ ఈవెంట్ ను బీసీసీఐ ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని చూస్తోంది.

IPL Auction

IPL 2025 మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. విదేశీ స్థలంలో వేలం నిర్వహించడం ఇది రెండోసారి. దీనికి ముందు చివరి వేలం దుబాయ్‌లో జరిగింది. ఇప్పటి వరకు ఆట‌గాళ్ల వేలానికి సంబంధించి అధికారికంగా పూర్తి వివ‌రాల‌ను బీసీసీఐ పంచుకోలేదు. అయితే ఆ రోజు పెర్త్ టెస్టులో మూడో, నాలుగో రోజు ఆట ఉంటే అవ‌కాశం ఉంద‌ని క్రికెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో వేలం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం జరుగుతుంది.

ఈసారి వేలం ‘మెగా వేలం’ ఎందుకొచ్చింది? 

ప్రతి మూడు సంవత్సరాలకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్లను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే అవకాశాన్ని అందుకుంటున్నాయి. రూల్స్ ప్ర‌కారం... అప్ప‌టివ‌ర‌కు కొన‌సాగిన జ‌ట్టులోని త‌క్కువ మంది (నిర్ణీత సంఖ్య‌లో) ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవడానికి అనుమతి ఉంటుంది. ఈసారి 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు వీలు క‌ల్పించారు. 2 మెగా వేలం మధ్య ప్రతి సంవత్సరం మినీ వేలం నిర్వహిస్తారు.

Latest Videos


ఈసారి IPL 2025 వేలంలో ఎంత మంది ఆటగాళ్లు ఉంటారు?

ప్రపంచ వ్యాప్తంగా 1574 మంది ఆటగాళ్లు ఐపీఎల్ మెగా వేలం 2025 కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్, ఫ్రాంచైజీల మధ్య చర్చల కారణంగా ఈ జాబితా త‌గ్గుతుంద‌ని భావిస్తున్నారు.  వేలం కోసం 500 నుండి 600 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేయవచ్చని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 

ఏ దేశానికి చెందిన ఆటగాళ్లు ఎంత మంది?

విదేశీ ఆటగాళ్లలో దక్షిణాఫ్రికా అత్యధికంగా 91 మంది న‌మోదుచేసుకున్నారు. దీని తర్వాత ఆస్ట్రేలియా 76 మంది ఆటగాళ్లు ఉన్నారు. అలాగే, ఐపీఎల్ 2025 వేలం కోసం ఒక ఇటాలియన్ ఆటగాడు కూడా నమోదు చేసుకున్నాడు. ఇది కాకుండా, అమెరికా, యుఎఇ, స్కాట్లాండ్, కెనడా నుండి ఆట‌గాళ్లు ఐపీఎల్ ఆడ‌టం కోసం ఆస‌క్తిగా ఉన్నారు. 

1. దక్షిణాఫ్రికా 91 మంది ఆట‌గాళ్లు
2. ఆస్ట్రేలియా 76
3. ఇంగ్లండ్ 52
4. న్యూజిలాండ్ 39
 5. వెస్టిండీస్ 33
6. శ్రీలంక 29
7. ఆఫ్ఘనిస్తాన్ 29
8. బంగ్లాదేశ్ 13
9. నెదర్లాండ్స్ 12
10. USA 10
11. ఐర్లాండ్ 9
12. జింబాబ్వే 8
13. కెనడా 4
14. స్కాట్లాండ్ 2
15. ఇటలీ 1
16. UAE 1

MS Dhoni, Virat Kohli, Dhoni-Virat,

ఆటగాళ్లకు ఎన్ని స్లాట్లు అందుబాటులో ఉన్నాయి?

ప్రతి ఫ్రాంచైజీ తన జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను తీసుకోవ‌చ్చు. జట్లలో కనీస ఆటగాళ్ల సంఖ్య 18. మొత్తం పది జట్లు ఉన్నాయి. కాబట్టి మొత్తం గరిష్టంగా 250 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. జట్లు ఇప్పటికే 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఐపీఎల్ వేలం సమయంలో గరిష్టంగా 204 స్లాట్‌లను భర్తీ చేయవచ్చు. ప్రతి జట్టు గరిష్టంగా ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లను కలిగి ఉంటాయి కాబ‌ట్టి వేలంలో విదేశీ ఆటగాళ్లకు 70 స్లాట్‌లు ఉన్నాయి.

CSK: 20 స్లాట్లు (7 ఓవర్సీస్)

RCB: 22 స్లాట్లు (8 ఓవర్సీస్)

SRH: 20 స్లాట్లు (5 ఓవర్సీస్)

MI: 20 స్లాట్లు (8 ఓవర్సీస్)

DC: 21 స్లాట్లు (7 ఓవర్సీస్)

RR: 19 స్లాట్లు (7 ఓవర్సీస్)

PBKS: 23 స్లాట్లు (8 విదేశీ)

KKR: 19 స్లాట్లు (6 ఓవర్సీస్)

GT: 20 స్లాట్‌లు (7 విదేశీ)

LSG: 20 స్లాట్లు (7 ఓవర్సీస్)

IPL వేలంలో జట్లకు వేర్వేరు సంఖ్యలో స్లాట్‌లు ఎందుకు ఉన్నాయి?

ఐపీఎల్ వేలానికి ముందు జట్లు వేర్వేరు సంఖ్యలో ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. దీని కారణంగా వారి వద్ద మిగిలి ఉన్న స్లాట్‌ల సంఖ్య కూడా భిన్నంగా ఉంటుంది. జట్లకు గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లు (గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు) రిటైన్ చేసుకోవ‌డానికి అనుమ‌తించారు. ఉదాహరణ- పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోగా, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేశాయి.

మెగా వేలానికి ఏ జట్టు పర్స్‌లో ఎంత డబ్బు ఉంది?

ఒక్కో జట్టు మొత్తం రూ.120 కోట్లు. ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ఇందులో కొంత భాగాన్ని వెచ్చించారు. మిగిలిన మొత్తాల వివ‌రాల ఇలా ఉన్నాయి.

1. పంజాబ్ కింగ్స్ - రూ. 110.5 కోట్లు
2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 83 కోట్లు
3. ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 73 కోట్లు
4. గుజరాత్ టైటాన్స్ - రూ. 69 కోట్లు
5. లక్నో సూపర్ జెయింట్స్ - రూ. 69 కోట్లు
6. చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 55 కోట్లు
7. ముంబై ఇండియన్స్ - రూ. 45 కోట్లు
8. కోల్ కతా నైట్ రైడర్స్ - 51 రూ. కోటి
9. సన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ. 45 కోట్లు
10. రాజస్థాన్ రాయల్స్- రూ. 41 కోట్లు

Rishabh Pant,KL Rahul,Arshdeep Singh, IPL, IPL2025

RTM కార్డ్ తో ఏంటి ఉప‌యోగం?

RTM అంటే రైట్ టు మ్యాచ్. ఈ రూల్ మొదటిసారిగా 2017లో అమలు చేశారు. అయితే ఇది 2022 మెగా వేలంలో తీసివేశారు. ఇప్పుడు మళ్లీ అమలులోకి వచ్చింది. ఈ నియమం ఫ్రాంచైజీకి మునుపటి సీజన్‌లో ఆ జట్టులో భాగమైన ఆటగాడిని తిరిగి కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తుంది.

ఒక ఆటగాడు విడుదలైన తర్వాత వేలంలోకి వచ్చినప్పుడు, అనేక జట్లు అతనిని వేలం వేస్తాయి. బిడ్ వేసిన తర్వాత ఈ ప్లేయర్ కోసం RTMని ఉపయోగించాలనుకుంటున్నారా అని రిలీజ్ టీమ్‌ని అడుగుతారు. అంటే గత సీజన్‌లో ఏదైనా జట్టు ఆటగాడు ఇప్పుడు వేలంలో అమ్ముడవుతుంటే, ఆ జట్టుకు RTM కార్డ్ వస్తుంది. ఇది ప్లేయర్‌ను తిరిగి కొనుగోలు చేయగలదని దీని అర్థం. అటువంటి పరిస్థితిలో పాత జట్టు దానిని ఉపయోగిస్తే ఆ ఆటగాడి కోసం వేలంలో ఉంచిన చివరి బిడ్‌కు సమానమైన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో పాత జట్టు RTMని ఉపయోగించకపోతే చివరి బిడ్ చేసిన జట్టు ఆ ఆటగాడిని కొనుగోలు చేస్తుంది.

ఏ టీమ్ కు ఎన్ని RTM కార్డులు మిగిలి ఉన్నాయి?

చెన్నై సూపర్ కింగ్స్ - ఒకటి (క్యాప్డ్/అన్‌క్యాప్డ్)
ముంబై ఇండియన్స్ - ఒకటి (అన్ క్యాప్డ్)
కోల్‌కతా నైట్ రైడర్స్ - ఏమీ లేవు
రాజస్థాన్ రాయల్స్ - ఏమీ లేవు
సన్‌రైజర్స్ హైదరాబాద్ - ఒకటి (అన్ క్యాప్డ్)
గుజరాత్ టైటాన్స్ - ఒకటి (క్యాప్డ్)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మూడు (ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ & ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్స్, లేదా ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్స్)
ఢిల్లీ క్యాపిటల్స్ - రెండు (ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ & ఒక క్యాప్డ్ ప్లేయర్, లేదా ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్స్)
పంజాబ్ కింగ్స్ - నలుగురు (క్యాప్డ్)
లక్నో సూపర్ జెయింట్స్ - ఒకరు (క్యాప్డ్).

click me!