IPL 2024: గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. !

First Published | Nov 27, 2023, 10:33 AM IST

Shubman Gill: తొలి సీజన్‌లోనే ట్రోఫీ అందించిన కెప్టెన్‌ను విడిచిపెట్టేందుకు గుజరాత్‌ అంగీకరించడం సంచలనంగా మారింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను మాజీ జట్టు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంద‌ని స‌మాచారం. దీంతో గుజ‌రాత్ కొత్త కెప్టెన్ అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. 
 

Shubman Gill to be Gujarat Titans’ new captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజ‌న్ ఆట‌గాళ్ల వేలానికి ముందు అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి. కీల‌క ఆట‌గాళ్ల‌ను వ‌దులుకోవ‌డం, వివిధ జ‌ట్లు మ‌ధ్య ఆటగాళ్ల మార్పిడి కొన‌సాగింది. ఈ క్ర‌మంలోనే హార్దిక్ పాండ్యా త‌న పాత జ‌ట్టు ముంబై ఇండియన్స్ కు మారాడు.

ఐపీఎల్ 2024 సీజ‌న్ కు సంబంధించి గుజరాత్ టైటాన్స్-ముంబై జ‌ట్ల మ‌ధ్య ప‌లువురు ఆట‌గాళ్లను మార్చుకున్నాయి. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య ఒప్పందాలు కుదిరాయి.
 


రాబోయే ఐపీఎల్ 2024 సీజన్ లో శుభ్‌మన్ గిల్ గుజ‌రాత్ కు సారథ్యం వహించే అవకాశం ఉంది. బ్యాటింగ్, టాప్ ఆర్డర్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. టీ20ల్లో శుభ్‌మన్ గిల్ కు సూప‌ర్ రికార్డులు ఉన్నాయి. 
 

నవంబర్ 26న ఆటగాళ్లను రిటైన్ చేసి విడుదల చేసే గడువు ముగియడంతో హార్దిక్ పాండ్యా డీల్ ఖరారైంది. ప్లేయర్ వేలానికి వారం రోజుల ముందు వరకు ట్రేడింగ్ విండో ఓపెన్ అవుతుంది.

ఇది ముంబై, గుజరాత్ ల మధ్య జరిగిన మొత్తం నగదు ఒప్పందం, కానీ ఇందులో ఉన్న మొత్తం గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. నవంబర్ 27న భారత క్రికెట్ అత్యున్నత మండలి బీసీసీఐ ఈ వార్తను బహిర్గతం చేసే అవకాశం ఉందని స‌మాచారం.
 

ప్ర‌స్తుతం ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తుండగా, హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్ పదవి దక్కనుందని తెలుస్తోంది. దీంతో గుజరాత్ లో ఇదివరకు కొనసాగిన హార్ధిక్ పాండ్యా ప్లేస్ ను రిప్లేస్ చేయాల్సి వుంది.  
 

హ‌ర్ధిక పాండ్యాను ముంబ‌యికి బ‌దిలీ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ వేట‌లో ప‌డింది. అయితే, భార‌త జ‌ట్టు భ‌విష్య‌త్తు కెప్టెన్ ప్ర‌శంస‌లు అందుకుంటున్న శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ అప్ప‌గించే అవ‌కాశ‌ముంది. గిల్ కు కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ లు స‌హ‌క‌రిస్తార‌ని క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. దీనిపై త్వ‌ర‌లోనే గుజ‌రాత్ క్లారిటీ ఇవ్వ‌నుంద‌ని స‌మాచారం. 
 

Latest Videos

click me!