Keerthy Suresh: మహిళల క్రికెట్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా మహానటి.. ఫోటోలు వైరల్..

First Published | Nov 27, 2023, 1:47 AM IST

Keerthy Suresh: ప్రముఖ సినీ నటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను మహిళా క్రికెట్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించారు. ఈ మేరకు కేరళ రాష్ట్ర మహిళా క్రికెట్‌కు  ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Keerthi Suresh

 ప్రముఖ సినీ నటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో అద్భుతంగా రాణించిన ఈ భామ బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అంతకు ముందు వరుస ఫ్లాప్లులు ముఠా కట్టుకున్న కీర్తి సురేష్ మమన్నన్ (తమిళ చిత్రం) విజయంతో  మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. ఈ విజయం సాధించి కీర్తి మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. 

Keerthy Suresh named goodwill ambassador for Kerala women's cricket

ఈ సౌత్ బ్యూటీ బాలీవుడ్‌ పై మనసు పారేసుకున్నదనే వార్త వైరల్‌గా మారింది. హిందీ సినిమా చేయాలనేది కీర్తి సురేష్ కోరిక. కీర్తి మంచి పాత్ర కోసం ఎదురుచూస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు బాలీవుడ్ లోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది. తనకు నచ్చిన పాత్ర దక్కినందుకు ధైర్యంగా హిందీలోకి దూసుకెళ్లింది కీర్తి. సౌత్ సినిమాలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె నటించిన చిత్రం మే 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే.. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్టు. ఇందులో తొలి కథానాయికగా కీర్తి ఎంపికైనట్టు సమాచారం. 

Latest Videos

click me!