IPL 2024: ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసే ముగ్గురు సర్‌ప్రైజ్ ప్లేయర్లు వీరే..!

First Published | Nov 25, 2023, 4:19 PM IST

IPL auction 2024: ఈసారి ఐపీఎల్ వేలంలో కొందరు కొత్త ఆటగాళ్లు వ‌స్తున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ తిరిగి వేలంలోకి రానుండగా, న్యూజిలాండ్ కు చెందిన రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
 

Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదటి ఎడిషన్ నుంచి ఇటీవలి 16వ ఎడిషన్ వరకు పలుమార్లు ఫైనల్స్ కు చేరినప్పటికీ ట్రోఫీని గెలవడంలో విఫలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2024 ఎడిషన్ లో ఎలాగైనా ట్రోఫీని గెలుచుకునే జట్టును ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉంది.

రాబోయే ఐపీఎల్ ఆటగాళ్ల వేలానికి ముందు నవంబర్ 26 లోగా ఆర్సీబీ తమ రిటైన్ చేసుకున్న జట్టును ప్రకటించాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ జ‌ట్టులో కీలక ఆటగాళ్లు కాగా, సరైన ఆటగాళ్లతో బలమైన జట్టును నిర్మించేందుకు ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ కృషి చేస్తోంది.

Latest Videos


ఐపీఎల్ ఆటగాళ్లను తీసుకోవ‌డంతో ఆర్సీబీ తప్పులు చేసిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. కొంతమంది సమర్థులైన ఆటగాళ్లను కొనుగోలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ అనవసరమైన ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపించారు. ఈ ఏడాది వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసే 3 సర్‌ప్రైజ్ ఎంపికల గురించి సంబంధిత క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. వారిలో ప్ర‌ధానంగా ముగ్గురు ఆట‌గాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి.
 

దునిత్ వెల్లలాగే (శ్రీలంక/ఆల్ రౌండ‌ర్)

గత ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ బౌలింగ్ ఆల్ రౌండ‌ర్ కరణ్ శర్మ 10.37 సగటుతో పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈసారి కరణ్ శర్మను జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. దీంతో ఆర్సీబీ తదుపరి వేలంలో సమర్థవంతమైన స్పిన్నర్ కోసం వెతుకుతోంది. 2023 ఆసియా కప్ లో శ్రీలంక తరఫున ఆడిన యువ ఆల్ రౌండ‌ర్ దునిత్ వెల్ల‌లాగే పై ఆర్సీబీ ఆసక్తి చూపే అవకాశం ఉంది. భారత్ తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో దునిత్ ఆరు వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాట్ తోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. కాబట్టి యువ ఆల్ రౌండర్ ను కొనుగోలు చేయడానికి ఆర్సీబీ ప్రయత్నించవచ్చు.

Bas De Leede-Tim De Leede

బాస్ డీ లీడ్ (నెదర్లాండ్స్/ఆల్ రౌండ‌ర్)

2023 ప్రపంచకప్ లో నెదర్లాండ్స్ తరఫున 16 వికెట్లు తీసిన ఆల్  రౌండ‌ర్ బాస్ డీ లీడ్ బ్యాట్ తోనూ స‌త్తాచాట‌గ‌ల‌డు. కాబట్టి రాబోయే ఐపీఎల్ 2024 ప్లేయర్స్ యాక్షన్ లో అత‌నికి మంచి డిమాండ్ లభించే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ లో ఈ డచ్ ఆటగాడు బ్యాట్ తోనూ రాణించి 448 పరుగులు చేశాడు. జట్టు తరుపున అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా నిలిచాడు.
 

సదీర సమరవిక్రమ (శ్రీలంక/బ్యాటర్)

వెటరన్ వికెట్ కీపర్,బ్యాటర్ దినేశ్ కార్తీక్ ను ఆర్సీబీ జట్టు నుంచి తప్పించడం దాదాపు ఖాయమైంది. కాబట్టి అతని స్థానంలో తగిన బ్యాట్స్ మ‌న్ ను తీసుకురావాలని ఆర్సీబీ ప్రయత్నిస్తోంది. అయితే వన్డే ప్రపంచకప్ లో శ్రీలంక తరఫున అత్యంత నిలకడైన ప్రదర్శన చేసిన బ్యాట్స్ మన్ సదీర సమరవిక్రమను కొనుగోలు చేసే ప్రయత్నం చేయవచ్చు. సమరవిక్రమ వికెట్ కీపర్ కూడా.

వీరితో పాటు బెంగ‌ళూరు ఆసక్తి చూపే ఆట‌గాళ్ల జాబితాలో వీళ్లు కూడా ఉన్నారు.. 

> ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా/ బ్యాటర్)
> మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా/ ఫాస్ట్ బౌలర్)
> డారిల్ మిచెల్ (న్యూజిలాండ్/ ఆల్ రౌండర్)
> విద్వాత్ కావరప్ప (కర్ణాటక/ ఆల్ రౌండర్)
> దిల్షన్ మధుశంక (శ్రీలంక/ ఫాస్ట్ బౌలర్)

click me!