IPL 2024: ఆండ్రూ రస్సెల్, లూకీ ఫర్గూసన్... టాప్ ప్లేయర్లను వదులుకున్న కేకేఆర్..

First Published | Nov 12, 2023, 7:39 PM IST

ఐసీసీ టోర్నీలు క్లైమాక్స్‌కి చేరే సమయానికి ఐపీఎల్ హంగామా మొదలుపెడుతుంది బీసీసీఐ. కీలక మ్యాచుల్లో రిజల్ట్ కాస్త అటు ఇటు అయినా మెజారిటీ ఫ్యాన్స్‌ మూడ్‌ని మార్చేందుకు ఐపీఎల్ న్యూస్ బాగా ఉపయోగపడుతుంది..
 

Image credit: PTI

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫైనల్ చేరిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఆ తర్వాత రెండు సీజన్లలో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో కేకేఆర్‌కి నితీశ్ రాణా కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Image credit: PTI

ఐపీఎల్ 2024 సీజన్‌కి ముందు కేకేఆర్, వేలానికి విడుదల చేసే ప్లేయర్ల లిస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2014 నుంచి పదేళ్లుగా కేకేఆర్‌కి ఆడుతున్న ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్‌ని మొదటి రిటెన్షన్‌గా రూ.16 కోట్లకు అట్టి పెట్టుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

Latest Videos


అయితే గత నాలుగు సీజన్లుగా బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న ఆండ్రే రస్సెల్, 2022లో 17 వికెట్లు తీయడం తప్ప మిగిలిన సీజన్లలో బౌలింగ్‌లోనూ మెప్పించలేకపోయాడు. దీంతో ఐపీఎల్ 2024 వేలానికి ఆండ్రే రస్సెల్‌ని విడుదల చేయాలని నిర్ణయ తీసుకుంది కేకేఆర్..

ఐపీఎల్ 2021 సీజన్‌లో కేకేఆర్ ఫైనల్‌కి వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు లూకీ ఫర్గూసన్. 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి ఆడిన లూకీ ఫర్గూసన్‌ని ట్రేడింగ్ ద్వారా టీమ్‌లోకి తీసుకుంది కేకేఆర్...

గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో 3 మ్యాచులే ఆడిన లూకీ ఫర్గూసన్ 7.4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న లూకీ ఫర్గూసన్‌ని వేలానికి వదిలేయనుంది కేకేఆర్..

అలాగే బంగ్లా బోర్డు అనుమతి లభించకపోవడంతో ఐపీఎల్ 2023 సీజన్ ఆడని షకీబ్ అల్ హసన్, 3 మ్యాచుల్లో 21 పరుగులే చేసిన నమీబియా ప్లేయర్ డేవిడ్ వీజ్, రిజర్వు బెంచ్‌కే పరిమితమైన జాన్సన్ ఛార్లెస్‌ని, 3 మ్యాచుల్లో 14 పరుగులే చేసిన మన్‌దీప్ సింగ్‌ని వేలానికి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది కేకేఆర్..

ఆండ్రే రస్సెల్, లూకీ ఫర్గూసన్‌ ఇద్దరూ వేలానికి వదిలివేయడం వల్ల కేకేఆర్ పర్సులో రూ.26 కోట్లు వచ్చి చేరుతుంది. 

Image credit: PTI

మిగిలిన నలుగురు ప్లేయర్లను విడుదల చేయడం ద్వారా మరో రూ.2 కోట్లు, గత ఏడాది పర్సులో మిగిలిన రూ.7.05 కోట్లతో కలిపి మొత్తంగా రూ.35.05 కోట్లతో వేలంలో పాల్గొంటుంది కేకేఆర్..  

click me!