సిక్సర్ల బాదుడులో రోహిత్ రికార్డు! ఏబీ డివిల్లియర్స్ రికార్డు బ్రేక్.. శుబ్‌మన్ గిల్ ఖాతాలో...

First Published | Nov 12, 2023, 2:46 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతోంది. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు.

Rohit Sharma

ఈ ఏడాది వన్డేల్లో 59 సిక్సర్లు బాదిన రోహిత్, ఒక ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా చరిత్ర లిఖించాడు. 2015లో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్ బాదిన 58 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్...
 

Rohit

కెప్టెన్‌గా ఓ వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిటే నమోదైంది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 22 సిక్సర్లు బాదగా, రోహిత్ శర్మ ఇప్పటికే 23 సిక్సర్లతో టాప్‌లో నిలిచాడు.
 

Latest Videos


Rohit Sharma

ఓపెనర్‌గా 14 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఈ ఫీట్ సాధించిన మూడో భారత ఓపెనర్‌గా నిలిచాడు. ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ 15758,  సచిన్ టెండూల్కర్ 15335 పరుగులు చేసి రోహిత్ కంటే ముందున్నారు.

ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్ శుబ్‌మన్ గిల్, 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో దాదాపు 1500 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మూడు ఫార్మాట్లలో కలిపి 2 వేల పరుగులు అందుకున్నాడు..
 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 91 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు, రోహిత్ శర్మ 34 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు.. 

click me!