రోహిత్ శర్మకు కెప్టెన్సీ తీసుకోవడం ఇష్టం లేదు! బలవంతంగా ఒప్పించాం.. - సౌరవ్ గంగూలీ

First Published | Nov 11, 2023, 3:28 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో 35 ఏళ్ల రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ దక్కింది. ఆ తర్వాత వన్డే, టెస్టు కెప్టెన్సీ కూడా రోహిత్‌కే దక్కాయి..
 

Rohit Sharma

ఆసియా కప్ 2018 విజయం తర్వాత అవకాశం ఉంటే టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని రోహిత్ శర్మ కామెంట్ చేశాడు..

Ganguly-Rohit Sharma

విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక, కేవలం టీ20 కెప్టెన్‌గా ఉండేందుకు రోహిత్ శర్మ ఇష్టపడలేదని, వన్డే కెప్టెన్సీ కూడా కావాలని డిమాండ్ చేశాడని వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే విరాట్‌ని బీసీసీఐ బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిందని కూడా వార్తలు వినిపించాయి..

Latest Videos


Rohit Sharma

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా 8 సీజన్లలో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో టైటిల్ గెలవలేకపోయాడు..
 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా 8 మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న టీమిండియా, నెదర్లాండ్స్‌తో మ్యాచ్ గెలవడం కూడా చాలా ఈజీ. తాజాగా బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..
 

‘రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసుకోవడానికి ఇష్టపడలేదు. నేను బలవంతంగా ఒప్పించా. నువ్వు తీసుకోవాల్సిందేనని చెప్పా, తీసుకోకపోయినా నేనే, నిన్ను కెప్టెన్‌గా ప్రకటిస్తానని చెప్పా.. 
 

ఎందుకంటే రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక భారత జట్టును నడిపించేందుకు అతనే సరైన వ్యక్తి...

Rohit Sharma

అందుకే ఇప్పుడు భారత జట్టు చూస్తున్న విజయాలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...

Rohit Sharma

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2019 వన్డే వరల్డ్ కప్‌లో, అంతకుముందు 2015 వన్డే వరల్డ్ కప్‌లో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరింది భారత జట్టు. అయితే సెమీ ఫైనల్‌లో ఓడి ఇంటిదారి పట్టింది. కాబట్టి రోహిత్ సేనకి సెమీస్‌ మ్యాచ్ కీలకం కానుంది.. 

click me!