Shubman Gill to be Gujarat Titans’ new captain: హార్దిక్ పాండ్యా 2022 లో గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి పాండ్యా సారథ్యం వహించిన తొలి సీజన్ లోనే ఐపీఎల్ టైటిల్ ను అందించాడు. ఇక 2023 ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్ కు చేరినా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది.
ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించి గుజరాత్ టైటాన్స్-ముంబై జట్ల మధ్య పలువురు ఆటగాళ్లను మార్చుకున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్ జట్టు తొలి సీజన్ లోనే కప్పును అందించిన హార్ధిక్ పాండ్యాను వదులుకుంది. హార్దిక్ పాండ్యా తన పాత జట్టు ముంబై ఇండియన్స్ కు సొంతం చేసుకుంది. ఫ్రాంచైజీల ఒప్పందాల్లో భాగంగా ఇది జరిగింది.
హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ పాత ఆటగాడు. గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలిపిన ఆటగాడు ఇప్పుడు ముంబైలో చేరడంపై గుజరాత్ కు చెందిన భారత మాజీ ఆటగాడు నయన్ మోంగియా హార్దిక్ ఆట గురించి మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు.
పాండ్యా ముంబైలోకి వెళ్లడంపై నయన్ మోంగియా స్పంఇస్తూ.. "అలా జరిగి ఉండాల్సింది కాదు. ఈ చర్య తప్పు. అతను గుజరాత్ టైటాన్స్ జట్టులో కొనసాగాల్సింది. టైటాన్స్ తో కలిసి హార్దిక్ విజయం సాధించాడు. తమ తొలి సీజన్లోనే టైటిల్ నెగ్గి, గత సీజన్ లో ఫైనలిస్టులుగా నిలిచింది' అని పేర్కొన్నాడు.
Hardik Pandya, rohith sharma
అయితే, గుజరాత్ టైటాన్స్ యజమానులు దీనిని ఆర్థిక ప్రోత్సాహంగా చూస్తున్నారని నయన్ మోంగియా అన్నారు. గుజరాత్ టైటాన్స్ యజమానులు మనీ ఫ్యాక్టర్ కారణంగా కీలక ఆటగాళ్ల బదిలీని అంగీకరించారు. హార్దిక్ వ్యాపారంతో వచ్చే డబ్బును పరిశీలిస్తున్నట్టు చెప్పారు.