ఐపీఎల్ 2024 వేలానికి డేట్ ఫిక్స్! ఫ్రాంఛైజీల పర్సులో మరింత డబ్బు...

Chinthakindhi Ramu | Published : Oct 27, 2023 4:35 PM
Google News Follow Us

ఐపీఎల్ 2024 సీజన్‌కి సంబంధించిన హడావుడి మొదలైపోయింది. లోక్‌సభ ఎన్నికలు, టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ కారణంగా ఐపీఎల్ 2024 సీజన్‌ ఈసారి కాస్త ముందుగానే మొదలు కానుంది..

15
ఐపీఎల్ 2024 వేలానికి డేట్ ఫిక్స్! ఫ్రాంఛైజీల పర్సులో మరింత డబ్బు...

2024, జూన్‌ 4 నుంచి జూన్ 30 వరకూ యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరగబోతోంది. ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ కూడా కన్ఫార్మ్ అయిపోయింది..

25

2024 ఏప్రిల్- మే మధ్య దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఐపీఎల్ 2024 టోర్నీని ఇండియాలో నిర్వహించాలంటే, మార్చి నెలలోనే జరపాల్సి ఉంటుంది...

35

తాజాగా ఐపీఎల్ 2024 మినీ వేలానికి సంబంధించిన వార్త, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా కథనాల ప్రకారం డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 వేలం జరుగుతుంది..

Related Articles

45
Image credit: PTI

ఈసారి దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 వేలం నిర్వహించబోతున్నారు. అలాగే ప్రతీ ఫ్రాంఛైజీ రూ.100 కోట్ల పర్సు వాల్యూతో వేలంలో పాల్గొనబోతున్నాయి. గతంలో పర్సు వాల్యూ రూ.95 కోట్లు ఉండగా ఈసారి రూ.5 కోట్లు పెరిగింది..
 

55

ఐపీఎల్ 2024 వేలంలో ప్యాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్, క్రిస్ వోక్స్, సామ్ బిల్లింగ్స్, జోష్ హజల్‌వుడ్ తదితర స్టార్ ప్లేయర్లు పాల్గొనబోతున్నారు.  

Read more Photos on
Recommended Photos