ధోనీ ఇలాంటి తప్పు చేస్తాడనుకోలేదు... మాహీ కెప్టెన్సీపై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

First Published Apr 1, 2023, 6:50 PM IST

టీమిండియాకి మాత్రమే కాదు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా మహేంద్ర సింగ్ ధోనీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్‌కి నాలుగు సార్లు టైటిల్ అందించిన ధోనీ, 11 సార్లు ప్లేఆఫ్స్‌కి, 9 సార్లు ఫైనల్‌కి చేర్చాడు.. రెండుసార్లు, ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిల్స్ కూడా అందించాడు... 
 

ఐపీఎల్ 2020 సీజన్‌లో మొట్టమొదటిసారి ప్లేఆఫ్స్ చేరలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత 2021 సీజన్‌లో టైటిల్ గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చిన సీఎస్‌కే, 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 10 పరాజయాలు మూటకట్టుకుని, 9వ స్థానంలో నిలిచింది...

Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌ని కూడా పరాజయంతో మొదలెట్టింది సీఎస్‌కే. 2022 డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడింది సీఎస్‌కే. ఈ మ్యాచ్‌లో మాహీ కెప్టెన్సీ తప్పిదాలను తీవ్రంగా విమర్శించాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..
 

Latest Videos


కొత్తగా వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్‌ని వాడి రెండో ఇన్నింగ్స్‌లో అంబటి రాయుడి స్థానంలో తుషార్ దేశ్‌పాండేని టీమ్‌లోకి తీసుకొచ్చింది చెన్నై సూపర్ కింగ్స్.. అయితే తుషార్, పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు...

MS Dhoni

3.2 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చిన తుషార్ దేశ్‌పాండే, ఒకే ఒక్క వికెట్ తీశాడు. ‘ధోనీ కెప్టెన్సీలో ఇలాంటి చిన్నచిన్న తప్పులు చేస్తాడని అస్సలు ఊహించలేదు. మిడిల్ ఓవర్లలో మొయిన్ ఆలీని వాడొచ్చు..

Tushar Deshpande

మొయిన్ ఆలీ ఎలాంటి బౌలరో అందరికీ తెలుసు. అతనితో మిడిల్ ఓవర్లలో ఒకటి రెండు ఓవర్లు వేయించి ఉంటే, తుషార్ దేశ్‌పాండేతో మళ్లీ బౌలింగ్ చేయించాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు...

రైట్ హ్యాండ్ బ్యాటర్లకు ఆఫ్ స్పిన్నర్‌ని వాడితే  కాస్త రిస్క్ అయినా రివార్డు వచ్చేది... తుషార్ దేశ్‌పాండేని దేశవాళీ క్రికెట్‌లో ఆఖరి ఓవర్లలోనే బౌలింగ్‌కి తెస్తారు. అతని బౌలింగ్ గురించి తెలుసుకోకుండా మాహీ అతనితో రెండో ఓవర్ వేయించాడు.. ’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్..

దీపక్ చాహార్‌తో ఓపెనింగ్ స్పెల్ వేయించిన మహేంద్ర సింగ్ ధోనీ, యంగ్ బౌలర్ రాజ్‌వర్థన్ హంగర్‌గేకర్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజాలతో నాలుగేసి ఓవర్లు వేయించాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన ఆఖరి ఓవర్ మొదటి 2 బంతుల్లో మ్యాచ్ ముగిసిపోయింది. 
 

click me!