రుతురాజ్ అన్ని రకాల షాట్స్ ఆడతాడు! కానీ శుబ్‌మన్ గిల్‌కి... రవిశాస్త్రి కామెంట్...

First Published Apr 1, 2023, 5:08 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో రెండు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ స్టార్స్‌గా గుర్తింపు పొందుతున్న శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు...

Ruturaj Gaikwad

చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. అయితే ఓపెనర్‌గా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేసి అదరగొట్టడంతో సీఎస్‌కే, 178 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది... ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి పరుగు, మొదటి బౌండరీ, మొదటి సిక్సర్, మొదటి హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్..
 

Image credit: PTI

గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు. గిల్ అవుట్ అయ్యే సమయానికి టైటాన్స్ విజయానికి ఇంకా 30 బంతుల్లో 42 పరుగులు కావాలి. విజయ్ శంకర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా కలిసి మ్యాచ్‌ని ముగించారు...

Latest Videos


Image credit: PTI

‘రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ కూడా టీమిండియా ఫ్యూచర్. రుతురాజ్ గైక్వాడ్ ఎలాంటి షాట్‌నైనా ఆడగలడు. అయితే శుబ్‌మన్ గిల్ అదే షాట్‌ని క్లాస్‌గా ఆడతాడు. శుబ్‌మన్ గిల్‌ స్పిన్, పేస్ బౌలింగ్‌లోనూ పరుగులు చేయగలడు...

ఇప్పటికే తన సత్తా గురించి శుబ్‌మన్ గిల్‌కి పూర్తి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. తాను ఓ వరల్డ్ క్లాస్ ప్లేయర్‌ని అనే విషయం గిల్ తెలుసుకున్నాడు. అందుకే ప్రపంచానికి ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు...
 

Shubman Gill

ఇంతకుముందు శుబ్‌మన్ గిల్ టీ20ల్లో ఎక్కువగా డాట్ బాల్స్ ఆడేవాడు. ఇప్పుడు అతని ఆటలో అది కూడా కనిపించడం లేదు. బౌండరీలు రాకపోతే సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైయిక్ రొటేట్ చేస్తున్నాడు. తానే స్ట్రైయిక్ అట్టిపెట్టుకోవాలని అనుకోవడం లేదు..

ఆఫ్ స్పిన్ ఆడడంలో శుబ్‌మన్ గిల్ టెక్నిక్ సూపర్. మిచెల్ సాంట్నర్ ఎంతో అనుభవం ఉన్న స్పిన్నర్ కానీ అతన్ని గిల్ చాలా ఈజీగా ఆడేశాడు. అలాగని ఎలాపడితే అలా ఆడకుండా టైమ్ తీసుకుని ఆడుతున్నాడు. నాకు తెలిసి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం, చేసిన పరుగుల వల్లే అతని బ్యాటింగ్‌లో మరింత పరిణతి వచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. 

click me!