క్యాచ్ పట్టినందుకు డేల్ స్టెయిన్‌పై అలిగిన ఏబీ డివిల్లియర్స్.. ఐపీఎల్ వల్ల ఏళ్లపాటు మాట్లాడలేదంటూ...

Published : Apr 01, 2023, 06:10 PM IST

ఐపీఎల్ దేశాల సరిహద్దులను చెరిపేసింది. ఎందరో దేశవిదేశ క్రికెటర్లను దగ్గర చేసింది. ఏబీ డివిల్లియర్స్- విరాట్ కోహ్లీ, ధోనీ - బ్రావో, రోహిత్ శర్మ - కిరన్ పోలార్డ్ వంటి స్నేహితులను చూసే అవకాశం, ఐపీఎల్ వల్లే కలిగింది. అయితే ఐపీఎల్ వల్ల ఒకే దేశానికి చెందిన ప్లేయర్లు గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి...

PREV
19
క్యాచ్ పట్టినందుకు డేల్ స్టెయిన్‌పై అలిగిన ఏబీ డివిల్లియర్స్.. ఐపీఎల్ వల్ల ఏళ్లపాటు మాట్లాడలేదంటూ...

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో జరిగిన గొడవ ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే మిగిలింది. ఈ గొడవ కారణంగా ఈ ఇద్దరి మధ్య సంబంధాలు ఇప్పటికీ బాగు పడలేదు. హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌ని చెంప మీద కొట్టడం... ఐపీఎల్‌లో మాయని మచ్చలా మిగిలిపోయింది..

29
Dale Steyn-AB de Villiers

ఐపీఎల్ 2016 సీజన్‌లో ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరుపున ఆడిన సౌతాఫ్రికా ప్లేయర్లు ఏబీ డివిల్లియర్స్, డేల్ స్టెయిన్ మధ్య కూడా ఇలాంటి గొడవే జరిగిందట...

39
dale steyn

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి బ్రియాన్ లారా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుంటే, ముత్తయ్య మురళీధరన్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా, డేల్ స్టెయిన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. 2013 నుంచి 2015 వరకూ సన్‌రైజర్స్‌కి ఆడిన డేల్ స్టెయిన్, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..

49

‘ఇది దాదాపు ఓ 10 ఏళ్ల క్రితం జరిగింది. 2012లో అనుకున్న నేను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి ఆడాను ఆ టైమ్‌లో. అప్పుడు నా బౌలింగ్ స్పీడ్ పీక్‌లో ఉండేది. కెరీర్‌లో అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయని హ్యాపీగా ఫీల్ అవుతున్న క్షణాలు...

59

ఆ టైమ్‌లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏబీ డివిల్లియర్స్‌ని కలిశా. ఆ మ్యాచ్‌లో ఏబీడీ, నా బౌలింగ్‌లో 20, 24 పరుగులు చేసినట్టు ఉన్నాడు. అయితే అవి నాకు ఓ 40లా అనిపించాయి.. ఆ తర్వాత రెండేళ్లకు అదే మైదానంలో, అదే బ్యాటర్.. మళ్లీ సేమ్...

69

నేను 18వ ఓవర్ వేయడానికి వచ్చా అనుకుంటా.. సేమ్ అప్పటిలాగే నా బౌలింగ్‌లో 24 పరుగుల దాకా చేశాడు. అతన్ని అవుట్ చేయలేకపోయాననే ఫ్రస్టేషన్‌లో నాలో నిండిపోయింది. నన్ను డీప్ మిడ్ వికెట్ పొజిషన్‌లో ఫీల్డింగ్‌కి పెట్టారు.. బాల్‌ని అందుకునే ఆత్రంలో తొందరపడ్డాను..  సింగిల్ రావాల్సిన చోటు, 2 పరుగులు వచ్చేశాయి...
 

79

ఆ తర్వాత 2015లో హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడాం. ఆ టైంలో నేను బౌలింగ్ చేయడం లేదు. మోయినిస్ హెండ్రిక్స్ బౌలర్, ఏబీ డివిల్లియర్స్ వచ్చాక మొదటి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. లాంగ్ ఆన్‌లో నేను మంచి క్యాచ్ పట్టుకున్నా...

89
De Kock-Dale Steyn

ఆ క్యాచ్ డ్రాప్ చేసి ఉంటే సిక్సర్ పోయి ఉండేది. క్యాచ్ చేతుల్లో పడగానే గాల్లోకి ఎగిరేసి సెలబ్రేట్ చేసుకున్నా. నేను అవుట్ చేసినట్టు ఫీలైపోయా. ఆ సెలబ్రేషన్స్, ఏబీడీని హార్ట్ చేశాయి.. మ్యాచ్ తర్వాత నన్ను కలిసి, ఎందుకంతలా సెలబ్రేట్ చేసుకున్నావని అడిగాడు..

99
dale steyn

నేను, తనని ఎప్పటి నుంచి అవుట్ చేయాలని చూస్తున్న విషయం చెప్పడానికి ప్రయత్నించా. అయితే ఏబీ డివిల్లియర్స్ వినిపించుకోలేదు. దాదాపు కొన్ని ఏళ్ల పాటు నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఇన్నాళ్లకు నన్ను అర్థం చేసుకున్నాడు..’ అంటూ చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్...

click me!

Recommended Stories