Published : Apr 30, 2023, 09:59 PM ISTUpdated : Apr 30, 2023, 11:05 PM IST
అండర్19 వరల్డ్ కప్ 2020 ద్వారా ఐపీఎల్‌లోకి వచ్చిన కుర్రాడు యశస్వి జైస్వాల్. అప్పటి నుంచి జైస్వాల్‌కి వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ వచ్చింది రాజస్థాన్ రాయల్స్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 2023 సీజన్‌లో సెంచరీతో దుమ్మురేపాడు జైస్వాల్...
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్ వేసిన మొదటి ఓవర్‌లో సిక్సర్‌తో ఖాతా తెరిచిన యశస్వి జైస్వాల్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు. రిలే మెడరిత్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో నాలుగు ఫోర్లు బాదిన యశస్వి జైస్వాల్, 16 పరుగులు రాబట్టాడు.
210
పియూష్ చావ్లా వేసిన ఓవర్‌లో ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు యశస్వి జైస్వాల్. జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడుతుంటే వరల్డ్ క్లాస్ బ్యాటర్ జోస్ బట్లర్ కూడా యాంకర్ రోల్ పోషిస్తున్నాడు. ఆర్చర్ లాంటి బౌలర్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, అంతకుమించి తెగింపు, నమ్మకం ఉండాలి. అవి ఈ 21 ఏళ్ల కుర్రాడిలో పుష్కలంగా కనిపిస్తున్నాయి..
310
ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ సెంచరీతో చెలరేగగా, 1000వ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ బాదాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతుంటే, మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్ మాత్రం ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ఒకే టెంపుని మెయింటైన్ చేస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
410
53 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వి జైస్వాల్.. సెంచరీ పూర్తయిన తర్వాత జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన యశస్వి జైస్వాల్, అర్షద్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుస బౌండరీలు బాదాడు.
510
Yashasvi Jaiswal
ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్‌కి ఇదే అత్యధిక స్కోరు. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్. 2011లో పాల్ వాల్తేటి చేసిన 120 పరుగుల రికార్డును అధిగమించాడు జైస్వాల్..
62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 62 బంతుల్లో 124 పరుగులు చేస్తే, మిగిలిన రాయల్స్ బ్యాటర్లు అందరూ కలిసి 59 బంతుల్లో 63 పరుగులే చేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో మరో 25 పరుగులు వచ్చాయి...
710
Image credit: PTI
అతి పిన్న వయసులో ఐపీఎల్ సెంచరీ బాదిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్. 19 ఏళ్ల 253 రోజుల వయసులో మనీశ్ పాండే సెంచరీ చేస్తే, రిషబ్ పంత్ 20 ఏళ్ల 218 రోజులు, దేవ్‌దత్ పడిక్కల్ 20 ఏళ్ల 289 రోజుల వయసులో ఐపీఎల్ సెంచరీలు చేశారు. యశస్వి జైస్వాల్ 21 ఏళ్ల 123 రోజుల వయసులో ఐపీఎల్ సెంచరీ బాదాడు..
810
Yashasvi Jaiswal
ముంబైలో ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన యశస్వి జైస్వాల్, అండర్19 వరల్డ్ కప్‌కి ముందు తండ్రితో కలిసి పానీపూరీ కూడా అమ్మాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.
910
Image credit: BCCI
ఇప్పటికే అండర్19 వన్డే వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్, రంజీ ట్రోఫీలో, ఇరానీ ట్రోఫీలో, దులీప్ ట్రోఫీలో, విజయ్ హాజారే ట్రోఫీలో సెంచరీలు చేశాడు. ఇండియా ఏ టీమ్ తరుపున సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్, ఐపీఎల్ సెంచరీతో తన సత్తా మరోసారి నిరూపించుకున్నాడు.
1010
తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 8 సిక్సర్లు బాదిన యశస్వి జైస్వాల్, 24 బౌండరీలు బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్. 2013లో పూణే వారియర్స్ ఇండియాతో మ్యాచ్‌లో 175 పరుగులు చేసిన క్రిస్ గేల్ 30 బౌండరీలు బాది టాప్‌లో ఉన్నాడు.