అదంతా సరే! అజింకా రహానేని ఎందుకు బ్యాటింగ్‌కి పంపలేదు... సీఎస్‌కే ఓటమికి అదే కారణమా...

First Published Apr 30, 2023, 8:26 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో సెన్సేషనల్ కమ్‌బ్యాక్ ఇచ్చిన వెటరన్ బ్యాటర్ అజింకా రహానే. 6 మ్యాచుల్లో 224 పరుగులు చేసిన అజింకా రహానే, 2 హాఫ్ సెంచరీలు బాదాడు. 200+స్ట్రైయిక్ రేటుతో అదరగొడుతున్న అజింకా రహానేని, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి పంపకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
 

Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొయిన్ ఆలీ గాయపడడంతో అతని ప్లేస్‌లో రిప్లేస్‌మెంట్‌గా టీమ్‌లోకి వచ్చిన అజింకా రహానే, 19 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. రహానే ఇన్నింగ్స్ కారణంగా ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే, వన్ సైడ్ విక్టరీ అందుకుంది...
 

Image credit: PTI

ఆ మ్యాచ్ తర్వాత వరుసగా 5 మ్యాచుల్లో అజింకా రహానేని వన్‌డౌన్‌లో పంపించింది చెన్నై సూపర్ కింగ్స్. తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 180+ స్ట్రైయిక్ రేటుతో మెరుపులు మెరిపిస్తూ వచ్చాడు అజింకా రహానే...
 

Latest Videos


Image credit: PTI

అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజింకా రహానే అసలు బ్యాటింగ్‌కే రాలేదు. వన్‌ డౌన్‌లో శివమ్ దూబేని పంపిన ధోనీ, ఆ తర్వాత మొయిన్ ఆలీని, రవీంద్ర జడేజాని బ్యాటింగ్‌కి పంపాడు. ఆఖరి ఓవర్‌లో తానే స్వయంగా బ్యాటింగ్‌కి వెళ్లాడు..

Image credit: PTI

అలాగని అజింకా రహానేకి ఏ గాయం కాలేదు. బ్యాటు, ప్యాడ్స్, హెల్మెట్ అన్నీ పెట్టుకుని ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే డగౌట్‌లో కూర్చున్నాడు అజింకా రహానే. ఎప్పటిలాగే వికెట్ పడితే బ్యాటింగ్‌కి వెళ్లాలని రెఢీ అయి వచ్చి కూర్చున్నాడు. అయితే ఇన్నింగ్స్ ముగిసే దాకా రహానే అలాగే కూర్చోవాల్సి వచ్చింది...

Image credit: PTI

రహానేతో పాటు శివమ్ దూబే కూడా ఈ సీజన్‌లో బాగా ఆడుతున్నాడు. అయితే అజింకా రహానేని వన్‌డౌన్‌లో పంపి ఉంటే... దూబే ఆడిన 17 బంతులు ఆడి ఉన్నా మరో 10-15 పరుగులు ఎక్కువ చేసి ఉండేవాడని అంటున్నారు అతని అభిమానులు...

Image credit: PTI

నాలుగో స్థానంలో వెళ్లిన మొయిన్ ఆలీ కానీ, ఆ తర్వాత వెళ్లిన రవీంద్ర జడేజా కానీ మెరుపులు మెరిపించలేకపోయారు. అజింకా రహానే రూపంలో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న బ్యాటర్ డగౌట్‌లో వెయిట్ చేస్తున్నా, ధోనీ అతన్ని ఎందుకు పంపలేదనేది అభిమానులను వేధిస్తున్న ప్రశ్నగా మారింది...
 

click me!