అర్జున్ టెండూల్కర్‌ని ధోనీ చేతికి ఇచ్చి ఉంటే బుమ్రాలా మార్చేవాడు! ట్రోల్స్ ఎదుర్కొన్న దేశ్‌పాండేని...

Published : Apr 30, 2023, 08:57 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఆరంగ్రేటం చేశాడు. 4 మ్యాచులు ఆడితే అందులో రెండింట్లో రెండే ఓవర్లు వేశాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 31 పరుగులు ఇచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు...

PREV
18
అర్జున్ టెండూల్కర్‌ని ధోనీ చేతికి ఇచ్చి ఉంటే బుమ్రాలా మార్చేవాడు! ట్రోల్స్ ఎదుర్కొన్న దేశ్‌పాండేని...
(PTI Photo) (PTI04_25_2023_000273B)

4 మ్యాచుల్లో 3 వికెట్లు తీసి, 9.36 ఎకానమీతో పరుగులు ఇస్తున్న అర్జున్ టెండూల్కర్‌ని గాడిలో పెట్టడం కంటే టీమ్‌కి విజయాలు ముఖ్యమని భావించిన రోహిత్ శర్మ, రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో అతన్ని పక్కనబెట్టేశాడు...

28
(PTI Photo/Kunal Patil)(PTI04_22_2023_000465B)

అయితే అర్జున్ టెండూల్కర్‌ని ముంబై ఇండియన్స్‌కి కాకుండా ధోనీ చేతికి అప్పగించి ఉంటే, ఈపాటికి బుమ్రాలా తయారుచేసేవాడని అంటున్నారు మాహీ ఫ్యాన్స్. దీనికి తుషార్ దేశ్‌పాండేని పర్ఫెక్ట్ ఉదాహరణం అంటున్నారు...

38
Image credit: PTI

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి వచ్చాడు తుషార్ దేశ్‌పాండే. ఆ మ్యాచ్‌లో 3.2 ఓవర్లు బౌలింగ్ చేసిన తుషార్ దేశ్‌పాండే, 51 పరుగులు సమర్పించాడు. ఆ మ్యాచ్ తర్వాత తుషార్ మరో మ్యాచ్ ఆడకపోవచ్చని అనుకున్నారు ఫ్యాన్స్..

48

అయితే అతనిపై నమ్మకం ఉంచిన మహేంద్ర సింగ్ ధోనీ, వరుసగా అవకాశాలు ఇచ్చాడు. 11.07 ఎకానమీతో పరుగులు సమర్పించినా 9 మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన తుషార్ దేశ్‌పాండే, పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు..

58

మొదటి మ్యాచ్ తర్వాత తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్న తుషార్ దేశ్‌పాండే మాత్రమే కాదు, పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని మథీశ పథిరాణా, ఆకాశ్ సింగ్ కూడా చక్కగా రాణిస్తున్నారు. దీంతో అర్జున్, ముంబై ఇండియన్స్ చేతుల్లో కాకుండా ధోనీ చేతుల్లో పడి ఉంటే మంచి ప్లేయర్ అయ్యేవాడని అంటున్నారు ఫ్యాన్స్.. 

68
Image credit: Mumbai Indians/Facebook

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్, మిడిల్ ఆర్డర్ మొత్తం అవుటైన తర్వాత ఆఖరి ఓవర్‌లో అర్జున్ టెండూల్కర్‌కి బౌలింగ్ ఇచ్చాడు రోహిత్ శర్మ. అప్పటికే ముంబై విజయం ఖరారైపోవడంతో అర్జున్‌, భువీని అవుట్ చేసి ఓ వికెట్ కూడా తీశాడు.

78
Arjun Tendulkar

అయితే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 31 పరుగులు ఇచ్చిన తర్వాత అర్జున్‌ని కేవలం మొదటి 2 ఓవర్లు బౌలింగ్ చేయడానికి మాత్రమే వాడుతున్నట్టు వాడాడు రోహిత్ శర్మ. 2 ఓవర్లు వేయడానికే ఓ ప్లేయర్ టీమ్‌లోకి వస్తే, ఆ మిగిలిన 2 ఓవర్లు వేసేందుకు మరో బౌలర్‌ని ఆడించాల్సిందే..

88

అసలే 8 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకుని ప్లేఆఫ్స్ రేసులో వెనకబడింది ముంబై ఇండియన్స్. దీంతో టెండూల్కర్ కొడుకుని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేశాడు రోహిత్ శర్మ.. ఇకపై జరిగే అన్నీ మ్యాచులు కీలకమైనవే కావడంతో ఏ బౌలర్ అయినా గాయపడితే తప్ప అర్జున్‌కి మరో ఛాన్స్ దక్కడం అనుమానమే.. 

Read more Photos on
click me!

Recommended Stories