కావాలనే శిఖర్ ధావన్‌ని సైడ్ చేశారు! అతను విరాట్ కోహ్లీ‌ కంటే ఫిట్, రోహిత్ శర్మ కంటే... - హర్భజన్ సింగ్

Published : Apr 07, 2023, 06:20 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుసగా రెండు సెంచరీలు చేశాడు శిఖర్ ధావన్. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ధావన్‌కి చోటు దక్కలేదు. 2021 నుంచి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. అయినా కూడా 2023 నుంచి వన్డేల్లో కూడా చోటు కోల్పోయాడు శిఖర్ ధావన్...

PREV
18
కావాలనే శిఖర్ ధావన్‌ని సైడ్ చేశారు! అతను విరాట్ కోహ్లీ‌ కంటే ఫిట్, రోహిత్ శర్మ కంటే... - హర్భజన్ సింగ్
kohli rohit dhawan

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ముగ్గురూ కూడా దాదాపు ఒకేసారి కెరీర్‌ని ప్రారంభించారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్టార్లుగా ఎదిగితే శిఖర్ ధావన్‌కి మాత్రం రావాల్సినంత క్రేజ్ దక్కలేదు. ఐసీసీ టోర్నీల్లో అదిరిపోయే పర్ఫామెన్స్‌లు ఇస్తూ ‘మిస్టర్ ఐసీసీ’గా పేరు దక్కించుకున్నప్పటికీ ధావన్‌ని సెలక్టర్లు చిన్నచూపు చూస్తూనే వచ్చారు... 

28
Sanju Samson-Shikhar Dhawan

ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు శిఖర్ ధావన్. మొదటి రెండు మ్యాచుల్లో కలిపి 126 పరుగులు చేసిన శిఖర్ ధావన్, 2023 ఆరెంజ్ క్యాప్ రేసులో రుతురాజ్ గైక్వాడ్ తర్వాతి ప్లేస్‌లో ఉన్నాడు..  రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు శిఖర్ ధావన్...

38
(PTI Photo) (PTI04_05_2023_000367B)

‘శిఖర్ ధావన్, పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్సీ చేస్తున్నాడు. మొదటి రెండు మ్యాచుల్లో బాగా ఆడాడు. కొన్ని నెలల ముందు టీమిండియాకి వన్డే కెప్టెన్‌గా ఉన్నాడు. సడెన్‌గా అతన్ని మూడు ఫార్మాట్ల నుంచి తప్పించేశారు. ఇప్పుడు అతనికి టీమిండియాలో చోటే లేదు...
 

48

శిఖర్ ధావన్ విషయంలో టీమిండియా, సెలక్టర్లు వ్యవహరిస్తున్న విధానం నాకు బాధను కలిగిస్తోంది. అతను చాలా పెద్ద ప్లేయర్. భారత క్రికెట్‌కి ఎంతో సేవ చేశాడు. ఐసీసీ టోర్నీల్లో శిఖర్ ధావన్ ఇచ్చిన పర్ఫామెన్స్‌కి రావాల్సినంత గుర్తింపు రాలేదు..
 

58

శిఖర్ ధావన్‌ని ఇలా చిన్నచూపు చూడకూడదు. ఇదే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేదా కెఎల్ రాహుల్ ఇలా ఆడి ఉంటే జనాలు దాని గురించే మాట్లాడువాళ్లు. కోహ్లీ, రోహిత్ ఆఖరికి కెఎల్ రాహుల్‌కి కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇస్తున్నారు కూడా...

68

కానీ శిఖర్ ధావన్ విషయంలో అలా జరగలేదు. ఒకటి రెండు సిరీస్‌లు ఫెయిల్ అయితే పక్కనబెట్టేశారు. శిఖర్ ధావన్‌కి ఇప్పుడు టీమ్‌లో చోటు కూడా లేదు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ ఆడిన ఇన్నింగ్స్‌లు అద్భుతం. మిగిలిన ఐసీసీ టోర్నీల్లోనూ ధావన్ చాలా బాగా ఆడాడు..
 

78

ఇంతకుమించి టీమిండియాలో ఉండాలంటే అతను ఇంకేం చేయాలి. ధావన్ చేయలేనిది, కోహ్లీ, రోహిత్ అంతగా ఏం చేశారు? శిఖర్ ధావన్‌కి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు. భారత జట్టులో అతనికి తప్పక చోటు ఉండాలి. 

88
Image credit: PTI

ఫిట్‌నెస్ విషయంలో అతను విరాట్ కోహ్లీకి తక్కువేమీ కాదు. నిలకడగా పరుగులు చేయడంలో రోహిత్ శర్మ కంటే మెరుగైన ప్లేయర్..  అయినా అతన్ని కావాలని సైడ్ చేశారు’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..

Read more Photos on
click me!

Recommended Stories