అసలే వరుస ఓటములు! ఢిల్లీ క్యాపిటల్స్‌కి మరో దెబ్బ... పెళ్లి చేసుకుంటున్న మిచెల్ మార్ష్...

Published : Apr 07, 2023, 05:29 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి క్రికెట్‌కి దూరం కావడం, టీమ్‌పై తీవ్రంగా పడింది. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో మొదటి రెండు మ్యాచుల్లో పోరాడకుండానే చేతుల్లో ఎత్తేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

PREV
17
అసలే వరుస ఓటములు! ఢిల్లీ క్యాపిటల్స్‌కి మరో దెబ్బ... పెళ్లి చేసుకుంటున్న మిచెల్ మార్ష్...
Mitchell Marsh

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది...

27

ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, స్వదేశానికి పయనమయ్యాడు. తొలి మ్యాచ్‌లో మొదటి బంతికే డకౌట్ అయిన మిచెల్ మార్ష్, ఆ తర్వాతి మ్యాచ్‌లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్, ఐపీఎల్‌లో ఆ పామ్‌ని కొనసాగించలేకపోయాడు...
 

37

వచ్చే వారం సిడ్నీలో తన ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు మిచెల్ మార్ష్. ఇందుకోసం ఐపీఎల్ 2023 సీజన్ నుంచి వారం రోజులు బ్రేక్ తీసుకున్నాడు. పెళ్లి తర్వాత నేరుగా ఇండియాకి హానీమూన్‌కి రాబోతున్నాడు మిచెల్ మార్ష్...

47
(PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000300B)

మిచెల్ మార్ష్ దూరం కావడంతో అతని ప్లేస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, వెస్టిండీస్ టీ20 కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌ని ఆడించే అవకాశం ఉంది. రెండు మ్యాచుల్లో డేవిడ్ వార్నర్ పర్వాలేదనిపించినా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు మాత్రం ఆడలేకపోయాడు...

57
Image credit: PTI

పృథ్వీ షా వరుసగా రెండు మ్యాచుల్లో ఫెయిల్ కావడంతో పాటు భారీ ఆశలు పెట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ అట్టర్ ఫ్లాప్ కావడం కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ని దెబ్బ తీసింది. అలాగే పాక్ సూపర్ లీగ్‌లో సెంచరీల మోత మోగించిన సౌతాఫ్రికా బ్యాటర్ రిలే రసో కూడా మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా మెప్పించలేకపోయాడు. 

67
(PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000337B)

రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌కి కీలకం కానుంది. ఇప్పటికే మైనస్ 1.703 నెట్ రన్ రేటుతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌ జోరుకి ఎలా అడ్డుకట్ట వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

77

మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 72 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓడినా ఆఖరి వరకూ పోరాడింది..

click me!

Recommended Stories