అతను ఆండ్రూ సైమండ్స్ లాంటోడు! సరిగ్గా వాడుకోండి, వరల్డ్ కప్ గెలిపిస్తాడు... రికీ పాంటింగ్ కామెంట్...

Published : Apr 07, 2023, 05:45 PM ISTUpdated : Apr 07, 2023, 05:46 PM IST

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాయే టైటిల్ ఫెవరెట్. 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌ నుంచి నిష్కమించిన భారత జట్టు, 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ సెమీస్ నుంచి ఇంటిదారి పట్టింది. అయినా ఈసారి టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి...

PREV
16
అతను ఆండ్రూ సైమండ్స్ లాంటోడు! సరిగ్గా వాడుకోండి, వరల్డ్ కప్ గెలిపిస్తాడు... రికీ పాంటింగ్ కామెంట్...
(PTI Photo/Shailendra Bhojak)(PTI12_30_2022_000024B)

భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాతో పాటు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ గాయాలతో టీమ్‌కి దూరమయ్యారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, వన్డే వరల్డ్ కప్ సమయానికి కోలుకోవడం అసాధ్యమే. బుమ్రా, అయ్యర్ ఆడతారా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి...

26

శ్రేయాస్ అయ్యర్ వరుసగా గాయపడుతుండడంతో వన్డేల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు సూర్యకుమార్ యాదవ్. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. ఒకే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో వరుసగా డకౌట్ అయిన ప్లేయర్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు...

36

టీ20ల్లో నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్న సూర్య, వన్డే ఫార్మాట్‌లో మాత్రం కుదురుకోలేకపోతున్నాడు. వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు నాలుగో స్థానంలో సరైన బ్యాటర్ అందుబాటులో లేకపోవడం టీమిండియాని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విషయం. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింట్ ఈ విషయం గురించి స్పందించాడు...

46
Suryakumar Yadav

‘సూర్యకుమార్ యాదవ్ గత ఏడాది, ఏడాదిన్నరగా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. టీ20ల్లో సూర్య ఎలా ఆడుతున్నాడో అందరూ చూశారు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతను టాప్‌లో ఉన్నాడు కూడా. ఓ ఒక్క సిరీస్ అతని సత్తాని తగ్గించదు...

56
(PTI Photo/Kunal Patil)(PTI01_31_2023_000333B)

నా అంచనా ప్రకారం సూర్యకుమార్ యాదవ్‌ని వన్డేల్లో కొనసాగిస్తే, అతను ఇండియాకి వరల్డ్ కప్ గెలిపించి ఇస్తాడు. ప్రతీ ప్లేయర్ కెరీర్‌లో ఏదో ఒకసారి తడబడడం, ఫామ్ కోల్పోవడం చాలా సాధారణ విషయం. సూర్యకుమార్ యాదవ్ కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు..

66

సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి వస్తే ఎలా ఆడతాడో అందరికీ తెలుసు. నా ఉద్దేశంలో ఆస్ట్రేలియాకి ఆండ్రూ సైమండ్స్‌లా, ఇండియాకి సూర్యకుమార్ యాదవ్ ఉపయోగపడతాడు. కొందరు ప్లేయర్లకు చూసుకుని జాగ్రత్తగా ఆడడం రాదు, అది వారి బలహీనత కాదు, అదే వారి బలం.. నా ఉద్దేశంలో సూర్య ఎప్పటికీ మ్యాచ్ విన్నరే..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. 
 

click me!

Recommended Stories