స్పిన్ పిచ్‌పై సెన్సేషనల్ సెంచరీ... ఎవరీ ప్రభుసిమ్రాన్ సింగ్! మన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో...

Published : May 14, 2023, 12:11 PM IST

ఐపీఎల్‌లో ఇప్పటిదాకా టైటిల్ గెలవలేకపోయిన టీమ్స్‌లో పంజాబ్ కింగ్స్ ఒకటి. 16 సీజన్లలో 15 మంది కెప్టెన్లను మార్చిన పంజాబ్ కింగ్స్, గత 3 సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను మార్చింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించింది పంజాబ్...

PREV
18
స్పిన్ పిచ్‌పై సెన్సేషనల్ సెంచరీ... ఎవరీ ప్రభుసిమ్రాన్ సింగ్! మన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో...
Image credit: PTI

స్పిన్ పిచ్‌పై మిగిలిన బ్యాటర్లు 20 పరుగులు కూడా చేయడానికి కష్టపడిన చోట పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్, 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేసి... సంచలన సెంచరీ నమోదు చేశాడు..

28

42 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న 61 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంటే 19 బంతుల్లో 50 పరుగులు రాబట్టి, పంజాబ్ కింగ్స్‌కి 167 పరుగుల స్కోరు అందించగలిగాడు. ప్రభుసిమ్రాన్ 103 పరుగులు చేస్తే సామ్ కుర్రాన్ 20 పరుగులు చేశాడు. సికందర్ రజా 11 పరుగులు తప్ప మిగిలిన పంజాబ్ బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు...

38

ఈ ఏడాది ఇప్పటికే వెంకటేశ్ అయ్యర్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్‌, ప్రభుసిమ్రాన్ సింగ్ రూపంలో నలుగురు భారత బ్యాటర్లు సెంచరీలు చేశారు. ఒకే సీజన్‌లో నలుగురు భారత ప్లేయర్లు సెంచరీలు చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2019లో సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, అజింకా రహానే ఈ ఫీట్ సాధించారు...

48

యశస్వి జైస్వాల్, ప్రభుసిమ్రాన్ సింగ్ ఇద్దరూ కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్లే. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి..

58
PTI Photo/Ravi Choudhary)(PTI05_13_2023_000387B)

2019 ఐపీఎల్ వేలంలో ప్రభుసిమ్రాన్ సింగ్‌ని రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్, 2020, 21 సీజన్లలో రెండేసి మ్యాచులు ఆడిన ప్రభుసిమ్రాన్ సింగ్, 2022 ఏడాదిలో ఒకే మ్యాచ్ ఆడాడు...

68
PTI Photo/Ravi Choudhary)(PTI05_13_2023_000387B)

ఈ ఏడాది ప్రభుసిమ్రాన్ సింగ్ వరుస అవకాశాలు దక్కించుకున్నాడు. 12 మ్యాచుల్లో 334 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు మరో హాఫ్ సెంచరీ కూడా ఉంది. 

78

గత ఏడాది పంజాబ్ తరుపున ఫస్ట్ క్లాస్ ఎంట్రీ ఇచ్చిన ప్రభుసిమ్రాన్ సింగ్, రంజీ ట్రోఫీ 2021-22 సీజన్‌లో సెంచరీ కూడా చేశాడు... లిస్టు ఏ క్రికెట్‌లో 12 మ్యాచులు ఆడి ఓ సెంచరీ, మరో హాఫ్ సెంచరీతో 355 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్, టీ20ల్లో 23 మ్యాచులు ఆడి ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో 603 పరుగులు చేశాడు.. 

88

22 ఏళ్ల ప్రభుసిమ్రాన్ సింగ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి ఓపెనర్‌గా ఆడుతున్న అన్‌మోల్ సింగ్‌కి బంధువు కూడా. ఈ ఇద్దరూ అన్నాదమ్ములు అవుతారు. 

click me!

Recommended Stories