అంపైరింగ్ బాగోలేదన్నందుకు హెన్రీచ్ క్లాసిన్‌కి ఫైన్... లక్నో బౌలర్ అమిత్ మిశ్రాకి కూడా..

Published : May 14, 2023, 11:46 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఊహించని ట్విస్టులు, సిక్సర్ల మోతతో పాటు ఫైన్‌ల బాదుడు కూడా ఎక్కువగానే ఉంది. స్లో ఓవర్ రేటు కారణంగా ఇప్పటికే చాలామంది కెప్టెన్లు ఫైన్ కట్టగా గ్రౌండ్‌లో గొడవ పడి కొందరు ప్లేయర్లు ఫైన్ కట్టారు...

PREV
17
అంపైరింగ్ బాగోలేదన్నందుకు హెన్రీచ్ క్లాసిన్‌కి ఫైన్... లక్నో బౌలర్ అమిత్ మిశ్రాకి కూడా..

కేకేఆర్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గొడవ పడిన నితీశ్ రాణా, హృతిక్ షోకీన్‌లకు మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ వేసిన రిఫరీ... అంతకుముందు గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడని విరాట్ కోహ్లీకి, హెల్మెట్ నేలకేసి బాదాడని ఆవేశ్ ఖాన్‌లకు ఫైన్ వేశాడు... 

27

లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌లో రచ్చ చేసిన విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌‌లకు 100 శాతం మ్యాచ్ ఫీజు ఫైన్ వేశాడు. ఈ గొడవకి కారణమైన నవీన్ వుల్ హక్ కూడా 50 శాతం మ్యాచ్ ఫీజు కోత పడింది...
 

37

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇద్దరు ప్లేయర్లకు ఫైన్ పడింది. ఆవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అబ్దుల్ సమద్ ఆడిన బంతికి ఫీల్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించడం, దాన్ని థర్డ్ అంపైర్ కరెక్ట్ బాల్‌గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే..

47
klassen fine

ఈ సంఘటన తర్వాత ప్రేక్షకులు అసహనతంతో లక్నో ప్లేయర్లపైకి నట్లు, బోల్టులు విసిరారు. దీని గురించి హైదరాబాద్ ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడిన హెన్రీచ్ క్లాసిన్... ‘ప్రేక్షకుల ప్రవర్తన నిరుత్సాహపరిచింది. అంపైరింగ్ కూడా బాలేదు...’ అంటూ వ్యాఖ్యానించాడు...

57
srh vs lsg

మీడియా ముఖంగా అంపైరింగ్ బాగోలేదని వ్యాఖ్యానించడం,ఐపీఎల్ కోడ్ ఉల్లంఘనగా గుర్తించిన రిఫరీ, అతనికి 10 శాతం మ్యాచ్ ఫీజు కోత వేసింది.

67
ipl umpires

ఇదే మ్యాచ్‌లో అన్‌మోల్‌ప్రీత్ సింగ్ వికెట్ తీసిన లక్నో బౌలర్ అమిత్ మిశ్రా, క్యాచ్ పట్టిన బంతిని నేలకేసి బాది అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు..

77

దీన్ని క్రమశిక్షణా ఉల్లంఘనగా గుర్తించిన రిఫరీ, అమిత్ మిశ్రాని మందలించి వదిలేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ ఆడుతున్న మ్యాచులే ఎక్కువగా వివాదాస్పదం అవుతుండడం విశేషం. 

click me!

Recommended Stories