అతన్ని తల మీద కొట్టారు! గొడుగులు పెట్టి డగౌట్ అంటారా... హైదరాబాద్ క్రికెట్ బోర్డుపై ట్రోల్స్...

Published : May 14, 2023, 11:21 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆఖరి ఓవర్ సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచులే కాదు, వివాదాలు, గొడవలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రేక్షకులు మైదానంలోకి బోల్టులు, నట్లు వేయడం అందర్నీ షాక్‌కి గురి చేసింది..

PREV
17
అతన్ని తల మీద కొట్టారు! గొడుగులు పెట్టి డగౌట్ అంటారా... హైదరాబాద్ క్రికెట్ బోర్డుపై ట్రోల్స్...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఆవేశ్ ఖాన్ వేసిన నో బాల్‌ని థర్డ్ అంపైర్ కరెక్ట్ బాల్‌గా ప్రకటించడంతో తీవ్ర అసహనానికి గురైన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్... లక్నో సూపర్ జెయింట్స్ డగౌట్‌పైకి బోల్టులు, నట్లు వేశారని వార్తలు వచ్చాయి...

27

దీంతో ఆటకు కాసేపు అంతరాయం కూడా కలిగింది. ఈ సంఘటన కారణంగానే తన రిథమ్ కోల్పోయి అవుట్ అయ్యానని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసిన్..

37
SRH vs LSG

తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ఈ సంఘటనపైన స్పందించాడు. ‘డగౌట్‌పైకి వేయలేదు. కానీ ప్లేయర్లపైకి నట్లు వేశారు. లాంగ్ ఆన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ప్రేరక్ మన్కడ్‌ తలపై కొట్టారు...’ అంటూ ట్వీట్ చేశాడు జాంటీ రోడ్స్...

47
srh vs lsg

‘హైదారాబాద్‌లో 16 సీజన్లుగా ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. వీళ్లు మూడు గొడుగులు పెట్టి, డగౌట్ అంటున్నారు. హైదరాబాద్ క్రికెట్ బోర్డు సరైన డగౌట్ నిర్మించలేదా? దానికి కూడా వారి దగ్గర డబ్బులు లేవా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్...

57
Image credit: PTI

ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల ఫ్యాన్స్ కొట్టుకున్నారు. అయితే లక్నోతో మ్యాచ్‌లో హైదరాబాద్ ఫ్యాన్స్ హద్దు మీరి ప్రవర్తించారు...

67
ipl umpires

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, 182 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌లో ఛేదించి పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి దూసుకెళ్లింది లక్నో సూపర్ జెయింట్స్... 

77

ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన ప్రేరక్ మన్కడ్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌గా నిలిచాడు. నికోలస్ పూరన్ 44, మార్కస్ స్టోయినిస్ 40 పరుగులు చేశారు. 

click me!

Recommended Stories