ఆ టీమ్‌లోకి వెళ్లినా ఈపాటికి ఎంట్రీ ఇచ్చేటోడు.. అర్జున్ టెండూల్కర్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ...

Published : Apr 08, 2023, 07:51 PM IST

అప్పుడెప్పుడో 2021 మినీ వేలంలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌ని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, ఆ తర్వాత కోచ్‌గా, బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా, మెంటర్‌గా ఉన్న సచిన్ టెండూల్కర్‌ మీద గౌరవంతోనే అర్జున్‌ని కొనుగోలు చేసినట్టు ట్రోల్స్ వచ్చాయి..

PREV
17
ఆ టీమ్‌లోకి వెళ్లినా ఈపాటికి ఎంట్రీ ఇచ్చేటోడు.. అర్జున్ టెండూల్కర్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ...

ముంబై ఇండియన్స్ టీమ్‌ని ఎన్నో సీజన్లుగా నెట్ బౌలర్‌గా ఉంటూ వచ్చిన అర్జున్ టెండూల్కర్‌ బౌలింగ్‌ నచ్చడం వల్లే అతన్ని కొనుగోలు చేశామని ముంబై మాజీ బౌలర్ జహీర్ ఖాన్. అయితే సీజన్లు గడుస్తున్న అర్జున్ టెండూల్కర్‌కి అవకాశం మాత్రం రావడం లేదు..
 

27
Arjun Tendulkar

2020 సీజన్‌లో ఐదో టైటిల్ గెలిచిన తర్వాత 2021లో నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్స్ బెర్త్ మిస్ చేసుకుంది ముంబై ఇండియన్స్. 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకుని, నాలుగే విజయాలు అందుకుంది...

37
Arjun Tendulkar

ఇలాంటి దారుణమైన సీజన్‌లోనూ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌ని తుది జట్టులో ఆడించే సాహసం చేయలేదు ముంబై ఇండియన్స్... గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ నుంచి తిలక్ వర్మ, హృతిక్ షోకీన్, కుమార కార్తీకేయ, డేవాల్డ్ బ్రేవిస్ వంటి కొత్త కుర్రాళ్లకు అవకాశం దక్కింది. 

47

ఈ సీజన్‌లోనూ మొదటి మ్యాచ్‌లో అర్షద్ ఖాన్, నేహాల్ వదేరాలకు అవకాశం ఇచ్చింది ముంబై ఇండియన్స్. అయితే అర్జున్ టెండూల్కర్‌కి మాత్రం తుది జట్టులో చోటు దక్కడం లేదు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ వంటి టీమ్స్‌లో ఉండి ఉంటే అర్జున్ టెండూల్కర్ ఈ పాటికి డజనుకి పైగా మ్యాచులు ఆడేసేవాడు...

57

ఐపీఎల్ 2022 మెగా వేలంలో పర్సులో రూ.30 లక్షలే ఉన్న సమయంలో అర్జున్ టెండూల్కర్ కోసం రూ.25 లక్షల బిడ్ వేసింది గుజరాత్ టైటాన్స్. ఆ జట్టు హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా, తన స్నేహితుడు సచిన్ కొడుక్కి పాకెట్ మనీగా రూ.10 లక్షలు అదనంగా ఇప్పించాడు...

67

కనీసం గుజరాత్ టైటాన్స్‌లో ఉండి ఉన్నా అర్జున్ టెండూల్కర్ ఇప్పటికే ఐపీఎల్ ఆరంగ్రేటం చేసేవాడని అంటున్నారు అభిమానులు. సచిన్ టెండూల్కర్ కొడుకు ఎలా ఆడతాడో చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ అంచనాల కారణంగానే అర్జున్‌ని అట్టి పెడుతోంది ముంబై ఇండియన్స్..

77

అర్జున్ టెండూల్కర్‌ని ఆడించి, అతను ఫెయిల్ అయితే సచిన్ టెండూల్కర్ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ముంబై ఇండియన్స్ కూడా భయపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే అవకాశం ఇవ్వకుండా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టడం వల్ల కూడా అర్జున్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని కామెంట్లు పెడుతున్నారు సచిన్ ఫ్యాన్స్.. 

click me!

Recommended Stories