ఇది PSL కాదు బ్రో... అక్కడ సూపర్ హిట్, ఇక్కడ అట్టర్ ఫ్లాప్! హారీ బ్రూక్ ఫెయిల్యూర్‌పై...

Published : Apr 08, 2023, 06:18 PM IST

పాక్ సూపర్ లీగ్‌ 2022లో సెన్సేషనల్ పర్ఫామెన్స్‌తో ఇంగ్లాండ్ టీమ్‌లోకి వచ్చాడు హారీ బ్రూక్. టెస్టుల్లో సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్న హారీ బ్రూక్‌ని ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...  

PREV
18
ఇది PSL కాదు బ్రో... అక్కడ సూపర్ హిట్, ఇక్కడ అట్టర్ ఫ్లాప్!  హారీ బ్రూక్ ఫెయిల్యూర్‌పై...

మొదటి మ్యాచ్‌లో 13 పరుగులు చేసి అవుటైన హారీ బ్రూక్, రెండో మ్యాచ్‌లో 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పాక్ సూపర్ లీగ్ 2022 లీగ్‌లో 10 మ్యాచులు ఆడిన హారీ బ్రూక్, 7 ఇన్నింగ్స్‌ల్లో 262 పరుగులు చేశాడు. 175.8 స్ట్రైయిక్ రేటుతో 65.50 సగటుతో అదరగొట్టాడు...

28
Harry Brook

మొదటి మ్యాచ్‌లో 13 పరుగులు చేసి అవుటైన హారీ బ్రూక్, రెండో మ్యాచ్‌లో 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పాక్ సూపర్ లీగ్ 2022 లీగ్‌లో 10 మ్యాచులు ఆడిన హారీ బ్రూక్, 7 ఇన్నింగ్స్‌ల్లో 262 పరుగులు చేశాడు. 175.8 స్ట్రైయిక్ రేటుతో 65.50 సగటుతో అదరగొట్టాడు...

38

పీఎస్‌ఎల్ ప్రదర్శనతో టెస్టుల్లో చోటు దక్కించుకున్న హారీ బ్రూక్, పాక్ పర్యటనలో చెలరేగిపోయాడు. ఇప్పటిదాకా 4 టెస్టుల్లో 10 ఇన్నింగ్స్‌ల్లో 809 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.. 
 

48

టెస్టుల్లో మంచి ప్రదర్శన ఇచ్చి మెప్పించిన హారీ బ్రూక్‌పై అప్పట్లో సంచలన కామెంట్లు చేశాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్. ‘ఈ తరంలో మూడు ఫార్మాట్లలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న ప్లేయర్లలో హారీ బ్రూక్ ఒకడు. నా ఉద్దేశంలో హారీ బ్రూక్, విరాట్ కోహ్లీలా సక్సెస్ అవుతాడు. అతని టెక్నిక్ చాలా సింపుల్ కానీ ఎలా సక్సెస్ కావాలో బాగా తెలుసు. హారీ బ్రూక్ ఫ్యూచర్ స్టార్’ అంటూ కామెంట్ చేశాడు బెన్ స్టోక్స్.

58

విరాట్ కోహ్లీ అవుతాడనుకున్న హారీ బ్రూక్, భారత పిచ్‌లపై తేలిపోతున్నాడు. కనీసం 30+ స్కోరు కూడా చేయలేకపోతున్నాడు.  రూ.13.25 కోట్ల ట్యాగ్ కూడా అతనికి భారంగా మారింది. బ్రూక్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్న సన్‌రైజర్స్, తొలి రెండు మ్యాచుల్లో మనోడి ఆట చూసి షాక్‌లో కోమాలోకి వెళ్లిపోయింది...

68

ఐపీఎల్‌లో మొదటి మూడు మ్యాచుల్లో కలిపి 44 పరుగులే చేసిన రిలీ రోసోవ్, సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవకాశం వచ్చినా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు.  సౌతాఫ్రికా స్టార్ రిలే రసో కూడా పాక్ సూపర్ లీగ్‌లో అదరగొట్టాడు. 2023 సీజన్‌లో 11 మ్యాచులు ఆడి 45.30 సగటుతో 453 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3లో నిలిచాడు. 

78
Image credit: PTI

పాక్ పిచ్‌లు బ్యాటర్లకు స్వర్గ ధామంగా ఉంటాయి. అదీకాకుండా అక్కడ బౌండరీ లైన్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బౌండరీ లైన్ కంటే చిన్నదిగా ఉంటుంది. ఈ కారణంగానే గాల్లోకి లేపితే చాలు సిక్సర్, బ్యాటుకి తగిలితే చాలు ఫోర్ అన్నట్టుగా సాగింది ఆట...

88
(PTI Photo/Vijay Verma) (PTI04_07_2023_000252B)

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కథ అలా ఉండదు. ఇక్కడ బౌండరీలు చాలా పెద్దవి. అంతేకాకుండా స్పిన్ పిచ్‌ల మీద నిలబడాలంటే టెక్నిక్ మాత్రం తెలిస్తే సరిపోదు, ఇక్కడ ఆడిన అనుభవం కూడా అవసరం. ఈ రెండూ లేకనే పాక్ లీగ్‌లో అదరగొట్టిన ప్లేయర్లు, ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. 

click me!

Recommended Stories