విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ రికార్డులు బ్రేక్... 6 వేల ఐపీఎల్ పరుగుల క్లబ్‌లో డేవిడ్ వార్నర్...

Published : Apr 08, 2023, 06:54 PM IST

ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఐపీఎల్‌లో 6 వేల పరుగుల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి విదేశీ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు డేవిడ్ వార్నర్. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఈ క్లబ్‌లో చేరిన మూడో క్రికెటర్ డేవిడ్ వార్నర్...

PREV
16
విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ రికార్డులు బ్రేక్... 6 వేల ఐపీఎల్ పరుగుల క్లబ్‌లో డేవిడ్ వార్నర్...
(PTI Photo)(PTI04_08_2023_000214B)

విరాట్ కోహ్లీ 6727, శిఖర్ ధావన్ 6370 పరుగులతో డేవిడ్ వార్నర్ కంటే ముందున్నారు. అయితే ఈ ఇద్దరి కంటే వేగంగా 6 వేల క్లబ్‌లో చేరిన బ్యాటర్‌గా నిలిచాడు డేవిడ్ వార్నర్. విరాట్ కోహ్లీ, 6 వేల పరుగుల క్లబ్‌లో చేరడానికి 188 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే, శిఖర్ ధావన్‌కి 199 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. వార్నర్ మాత్రం 165 ఇన్నింగ్స్‌ల్లో 6 వేల క్లబ్‌లో చేరాడు..

26
David Warner

మొత్తంగా ఐపీఎల్‌లో 13 మంది బ్యాటర్లు 4 వేల కంటే ఎక్కువ పరుగులు చేయగా అందులో బెస్ట్ యావరేజ్ ఉన్న బ్యాటర్ డేవిడ్ వార్నరే (సగటు 42.28). అంతేకాకుండా డేవిడ్ వార్నర్ స్ట్రైయిక్ రేటు 140.08గా ఉండగా ఏబీ డివిల్లియర్స్ 151.68, క్రిస్ గేల్ 148.96 స్ట్రైయిక్ రేటుతో వార్నర్ కంటే ముందున్నారు. 

36

ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఏకైక బ్యాటర్ డేవిడ్ వార్నర్. 2014 నుంచి 2020 మధ్య వరుసగా 6 సీజన్ల పాటు 500+ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు వార్నర్. 2022లో 432 పరుగులు చేసిన వార్నర్, ఈ సీజన్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు.. 
 

46

ఏ ముహుర్తాన ఐపీఎల్‌లో అడుగుపెట్టాడో కానీ డేవిడ్ వార్నర్ క్రికెట్ కెరీర్ మలుపు తిరిగింది. ఐపీఎల్‌లో అదరగొట్టి, సెలక్టర్ల దృష్టిలో పడి ఆస్ట్రేలియా టీమ్‌లో స్టార్ ప్లేయర్ అయ్యాడు డేవిడ్ వార్నర్. ఫస్ట్ క్లాస్ కెరీర్ కూడా లేని వార్నర్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి ఐపీఎల్ టైటిల్ కూడా అందించాడు...

56

2009లో ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన డేవిడ్ వార్నర్, ప్రారంభంలో 4 సీజన్లు ఢిల్లీ జట్టుకి ఆడాడు. 2014 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మారిన డేవిడ్ వార్నర్, ఆ టీమ్‌ని సొంత జట్టు కంటే ఎక్కువగా అభిమానించాడు. గాయాలు కూడా లెక్కచేయకుండా ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ భారాన్ని మోశాడు..
 

66

టీమ్ మేనేజ్‌మెంట్‌తో విభేదాల కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి దూరమైన డేవిడ్ వార్నర్‌ని 2022 మెగా వేలంలో రూ.6.25 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. వార్నర్ లాంటి మ్యాచ్ విన్నర్‌కి ఇది చాలా తక్కువ మొత్తమేనని మాజీ క్రికెటర్లే స్వయంగా కామెంట్ చేశారు..

Read more Photos on
click me!

Recommended Stories