హార్ధిక్ పాండ్యాలో ధోనీ కనిపిస్తున్నాడు.. గుజరాత్ టైటాన్స్ యంగ్ స్పిన్నర్ సాయి కిషోర్ కామెంట్...

First Published Mar 25, 2023, 3:47 PM IST

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓ స్పెషల్ గుర్తింపు ఉంది. సీఎస్‌కేలోకి వెళ్లిన ఏ యంగ్ ప్లేయర్ కూడా అంత తేలిగ్గా తుది జట్టులోకి రాలేదు. యంగ్ ప్లేయర్ల కంటే 30 ఏళ్లు దాటిన సీనియర్లను ఆడించడానికే ధోనీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు...

Dhoni-Hardik Pandya

15 ఏళ్ల సీఎస్‌కే చరిత్రలో ఆ టీమ్‌ నుంచి వెలుగులోకి వచ్చిన యంగ్ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ చౌదరి వంటి చాలా తక్కువ. రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులోకి రావడానికి చాలా పెద్ద తతంగమే జరిగింది. 2020 సీజన్‌లో సీఎస్‌కే వరుస విజయాల తర్వాత ట్రోల్స్‌ని తట్టుకోలేక రుతురాజ్‌ని ఆడించిన సీఎస్‌కే, దీపక్ చాహార్ గాయపడడంతో ముకేశ్ చౌదరికి అవకాశం ఇచ్చింది...

ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రిజర్వు బెంచ్‌లో కూర్చొన్ని మగ్గిపోయిన ప్లేయర్లు, ఇప్పుడు వేరే టీమ్స్ తరుపున అదరగొడుతున్నారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న ఆర్ సాయి కిషోర్, గతంలో సీఎస్‌కే జట్టులో ఉన్నాడు, గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆరంగ్రేటం చేశాడు...
 

Latest Videos


‘హార్ధిక్ పాండ్యా, మాహీ భాయ్ ఇద్దరూ కూడా చాలా విషయాలను ఒకేలా డీల్ చేస్తారు. ఫీల్డ్‌లో చాలా ప్రశాంతంగా ఉంటారు. నాకు హార్ధిక్ పాండ్యాలో మహేంద్ర సింగ్ ధోనీ భాయ్ కనిపిస్తారు... నాకు తెలిసి పాండ్యాపైన మాహీ భాయ్ ప్రభావం చాలా ఉన్నట్టు ఉంది...

హార్ధిక్ పాండ్యాలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే అన్ని విషయాలను ఒకే రకంగా చూస్తాడు. గెలిచినప్పుడు ఎంత హుందాగా ఉంటాడో ఓడినప్పుడు కూడా అంతే హుందాగా వ్యవహరిస్తాడు. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ లక్షణం ఉంటుంది..

నేను కెప్టెన్‌ని, నేను చెప్పినట్టే అందరూ వినాలనే ఆలోచన హార్ధిక్ పాండ్యాలో ఉండదు. అందరి అభిప్రాయానికి విలువ ఇస్తాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌ అనే ట్యాగ్ మా టీమ్‌పై ప్రభావం చూపిస్తుందని అనుకోవడం లేదు.. గత ఏడాది మేం బాగా ఆడాం, అందుకే గెలిచాం...

ఈసారి కూడా గెలవాలంటే అంత కష్టపడాలి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ టీమ్స్‌కి బాగా ఉపయోగపడుతుంది. 12 మంది ప్లేయర్లతో ఆడడమంటే, బోనస్ దొరికినట్టే. దేశవాళీ టోర్నీల్లో 14వ ఓవర్‌లోపు ఇంపాక్ట్ ప్లేయర్‌ని వాడాలి. అయితే ఐపీఎల్‌లో 20వ ఓవర్ వరకూ ఆ వెసులుబాటు ఇచ్చారు...
 

ఐపీఎల్‌లో బాగా ఆడితే, టీమిండియాలోకి వెళ్లడం తేలికైపోతుంది. తమిళనాడులో చాలా మ్యాచుల్లో బాగా ఆడాను. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేయాలంటే అటెన్షన్ చాలా ముఖ్యం. కళ్లు మూసుకుని కొట్టినట్టు కొడితే, అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు రవిశ్రీనివాసన్ సాయి కిషోర్..

click me!