జస్ప్రిత్ బుమ్రా గాయంపై సస్పెన్స్! రోహిత్‌, ద్రావిడ్‌కి కూడా తెలియకుండా దాస్తున్న బీసీసీఐ...

Published : Mar 25, 2023, 02:04 PM IST

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా 6 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలు ఆడని జస్ప్రిత్ బుమ్రా... ఐపీఎల్ 2023 సీజన్‌తో పాటు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా దూరమయ్యాడు...

PREV
18
జస్ప్రిత్ బుమ్రా గాయంపై సస్పెన్స్! రోహిత్‌, ద్రావిడ్‌కి కూడా తెలియకుండా దాస్తున్న బీసీసీఐ...
Jasprit Bumrah

జస్ప్రిత్ బుమ్రా గాయం గురించి మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బుమ్రా త్వరలోనే కోలుకుని, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడతాడని కామెంట్ చేశాడు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. అయితే అలా జరగలేదు...

28
Jasprit Bumrah

నేను ఫిట్‌గా ఉన్నానని, ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని జస్ప్రిత్ బుమ్రా స్వయంగా ప్రకటించాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే జాతీయ క్రికెట్ అకాడమీ పెద్దలు మాత్రం జస్ప్రిత్ బుమ్రాని ఆడించి రిస్క్ చేయడం ఇష్టం లేక ఆపేస్తున్నారట...

38
Image credit: PTI

దీనికి ప్రధాన కారణం దీపక్ చాహార్. భారత ఆల్‌రౌండర్ దీపక్ చాహార్ కూడా ఇదే విధంగా వెన్ను నొప్పితో బాధపడుతూ టీమ్‌కి దూరమయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు వెన్ను గాయంతో ఆటకు దూరమైన దీపక్ చాహార్, పూర్తిగా కోలుకుని తిరిగి ఆడడానికి ఆరు నెలల దాకా సమయం తీసుకున్నాడు...

48
Image credit: Getty

బుమ్రా గాయపడడంతో దీపక్ చాహార్‌ని ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడించాలని అనుకుంది టీమిండియా. అయితే అది కూడా వర్కవుట్ కాలేదు. బుమ్రా గాయపడిన కొన్ని రోజులకే దీపక్ చాహార్ గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో అతను మళ్లీ ఆరు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2023 సీజన్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు దీపక్ చాహార్...

58
Jasprit Bumrah

దీపక్ చాహార్‌, జస్ప్రిత్ బుమ్రా గాయం దాదాపు ఒక్కటే రకం. అందుకే చాహార్‌కి జరిగినట్టు, జస్ప్రిత్ బుమ్రా విషయంలో జరగకూడదని తెగ జాగ్రత్త పడుతోందట బీసీసీఐ. అందుకే జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌నెస్ గురించి ఎవ్వరికీ తెలియకుండా టాప్ సీక్రెసీ మెయింటైన్ చేస్తోందట...

68
Image credit: Getty

‘బీసీసీఐలో ఉన్న చాలామందికి కూడా జస్ప్రిత్ బుమ్రా గాయం స్టేటస్ గురించి తెలీదు. కేవలం ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌ మాత్రం బుమ్రాని స్పెషల్‌గా పర్యవేక్షిస్తున్నాడు. బుమ్రాతో, ఫిజియోలతో మాట్లాడుతూ అతన్ని ట్రైయిన్ చేస్తున్నాడు...

78

సెలక్షన్ కమిటీ సభ్యులకు కూడా బుమ్రా గాయం గురించి ఎలాంటి వివరాలు తెలీదు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మలకు కూడా జస్ప్రిత్ బుమ్రా గాయం ఎంత తీవ్రమైనది? కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయాలు చెప్పకుండా దాచి పెడుతోంది బీసీసీఐ...

88
bumrah

నిజానికి అతను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే వెంటనే ఆడిస్తే మళ్లీ గాయపడే అవకాశాలు ఉన్నాయని ఉద్దేశంతో అతన్ని దాచి పెట్టి మానిటర్ చేస్తోంది బీసీసీఐ. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ గురించి కాకుండా, వచ్చే నాలుగైదు ఏళ్ల బుమ్రా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని... ఈ విధంగా చేస్తోంది...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి, ఇంగ్లీష్ మీడియాతో తెలియచేశాడు...

Read more Photos on
click me!

Recommended Stories