ఐపీఎల్ 2023 సీజన్‌లో నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు బాది, ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు విరాట్ కోహ్లీ. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రవర్తన హాట్ టాపిక్ అయ్యింది...
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఆ పొజిషన్‌లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాడు. వన్డేల్లో అత్యధిక విన్నింగ్ పర్సేంటేజ్ ఉన్న కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, 2023 వన్డే వరల్డ్ కప్ వరకూ కెప్టెన్‌గా కొనసాగాలని అనుకున్నాడు. అయితే గంగూలీ అండ్ టీమ్ అందుకు అంగీకరించలేదు...
28
సౌతాఫ్రికా టూర్‌కి టీమ్‌ని ప్రకటించడానికి పావుగంటల ముందు జూమ్ మీటింగ్‌లో తాను కెప్టెన్ కాదనే విషయాన్ని సెలక్టర్లు తనతో చెప్పారని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ వైరం గురించి చాలా రకాల వార్తలు వచ్చాయి..
38
వాటిని నిజం చేస్తూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో అంతా బయటపెట్టాడు. సౌరవ్ గంగూలీకి విరాట్ కోహ్లీ అంటే నచ్చదని, అందుకే అతన్ని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చినట్టు చేతన్ శర్మ కామెంట్ చేశాడు...
48
ganguly kohli
ఈ పరిణామాల తర్వాత మొదటిసారి గంగూలీ, విరాట్ కోహ్లీ... ఆర్‌సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌లో తారసపడ్డారు. అందుకే దీన్ని ఆర్‌సీబీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌గ కాకుండా సౌరవ్ గంగూలీ వర్సెస్ విరాట్ కోహ్లీ మ్యాచ్‌గా చూశారు అభిమానులు...
58
Virat Kohli Sourav Ganguly
ముందుగానే ఊహించినట్టుగా ఈ మ్యాచ్‌లో భారీ హైడ్రామా, నాటకీయ పరిణామాలు జరిగాయి. హాఫ్ సెంచరీ తర్వాత అగ్రెసివ్‌గా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్న విరాట్ కోహ్లీ, మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో చేతులు కలపడానికి కూడా ఇష్టపడలేదు...
68
kohli ganguly
కథ అంతటితో ముగిసిపోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, ప్రాక్టీస్ చేసేందుకు మరోసారి ప్యాడ్స్ కట్టుకున్న విరాట్ కోహ్లీ, డగౌట్‌లో కాలు మీద కాలు వేసుకుని ఠీవిగా కూర్చోవడం, అటుగా సౌరవ్ గంగూలీ వచ్చినా పట్టించుకోకపోవడం.. మిగిలిన ఢిల్లీ ప్లేయర్లను పలకరించడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి...
78
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో సౌరవ్ గంగూలీని అన్‌ఫాలో కూడా చేసేశాడు విరాట్ కోహ్లీ. మ్యాచ్‌కి ముందు విరాట్ కోహ్లీ 277 మంది ఫాలో అవుతుండగా, మ్యాచ్ తర్వాత ఆ సంఖ్య 276కి పడిపోయింది. ఎవరిని అన్‌ఫాలో చేశాడని గమనించిన అభిమానులకు విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ లిస్టులో గంగూలీ లేకపోవడం కనిపించింది...
88
తనను ఎంతో మానసిక క్షోభకు గురి చేసిన సౌరవ్ గంగూలీపై విరాట్ కోహ్లీ ఇలా పగ తీర్చుకోవడాన్ని కొందరు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఓ మాజీ కెప్టెన్, మరో సీనియర్ కెప్టెన్ విషయంలో ఇలా వ్యవహరించకుండా, హుందాతనం చూపించి ఉంటే, గంగూలీని అది ప్రశ్చాత్యాప పడేలా చేసి ఉండేదని కామెంట్లు పెడుతున్నారు మరికొందరు..