అతను అంత బాగా బౌలింగ్ చేసినప్పుడు ఇంకో 2 ఓవర్లు ఇవ్వొచ్చుగా బ్రో... హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీపై..

Published : Apr 17, 2023, 10:20 AM IST

ఐపీఎల్‌ టైటిల్ గెలిచి టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్న రెండో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా. రోహిత్ శర్మ, ఐపీఎల్ ట్రాక్ రికార్డు కారణంగానే విరాట్ కోహ్లీని బలవంతంగా తప్పించి అతనికి కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ. ఐపీఎల్ 2022 సీజన్‌లో పాండ్యా పట్టుకున్నదల్లా బంగారం అయ్యింది...

PREV
17
అతను అంత బాగా బౌలింగ్ చేసినప్పుడు ఇంకో 2 ఓవర్లు ఇవ్వొచ్చుగా బ్రో... హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీపై..
PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000403B)

ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా హార్ధిక్ పాండ్యా టీమ్‌ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తోంది. కేకేఆర్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 200+ స్కోరు చేసినా, రషీద్ ఖాన్ హ్యాట్రిక్ సాధించినా.. రింకూ సింగ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ కారణంగా విజయం సాధించలేకపోయిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఓడి సీజన్‌లో రెండో ఓటమి చవి చూసింది..

27
sanju hardik

వృద్ధిమాన్ సాహా 4 పరుగులకే అవుటైనా శుబ్‌మన్ గిల్ 45, సాయి సుదర్శన్ 20, హార్ధిక్ పాండ్యా 28, డేవిడ్ మిల్లర్ 46, అభినవ్ మనోహార్ 27 పరుగులు చేసి సమిష్టిగా రాణించడంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది..

37

ఈ లక్ష్యఛేదనలో యశస్వి జైస్వాల్ 1, జోస్ బట్లర్ డకౌట్ అయినా దేవ్‌దత్ పడిక్కల్ 26, సంజూ శాంసన్ 60, అశ్విన్ 10, ధృవ్ జురెల్ 18 పరుగులు చేశారు. సిమ్రాన్ హెట్మయర్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు..
 

47
sanju samson

మొదటి 12 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేసింది రాజస్థాన్ రాయల్స్. చివరి 8 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 112 పరుగులు కావాలి. గుజరాత్ టైటాన్స్ ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా. అయితే ఇక్కడే మ్యాచ్ ములుపు తిరిగింది..

57

13వ ఓవర్‌లో 20, 14వ ఓవర్‌లో 15, 15వ ఓవర్‌లో 13 పరుగులు రాబట్టిన రాజస్థాన్ రాయల్స్, 16వ ఓవర్‌లో 20, 17వ ఓవర్‌లో 8, 18వ ఓవర్‌లో 13, 19వ ఓవర్‌లో 16 పరుగులు చేసింది. దీంతో ఆఖరి 7 ఓవర్లలోనే 108 పరుగులు వచ్చేశాడు. చివరి ఓవర్‌‌లో 2, 6 బాది మ్యాచ్‌ని ముగించాడు సిమ్రాన్ హెట్మయర్...

67

మొదటి 2 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చిన సీనియర్ పేసర్ మోహిత్ శర్మకు తిరిగి బౌలింగ్ ఇవ్వని హార్ధిక్ పాండ్యా.. అల్జెరీ జోసఫ్, నూర్ అహ్మద్‌లను కొనసాగించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 కీలక వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన మోహిత్‌ని పాండ్యా కరెక్టుగా వాడుకుని ఉంటే, గుజరాత్ టైటాన్స్ గెలిచేదని అంటున్నారు అభిమానులు...

77

అయితే మొదటి  3 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 9 పరుగులే ఇచ్చిన మహ్మద్ షమీ, 19వ ఓవర్‌లో 16 పరుగులు ఇచ్చేశాడు. దీంతో డెత్ ఓవర్‌లలో మోహిత్ శర్మను తిరిగి తెచ్చినా పెద్దగా ఫలితం దక్కి ఉండేది కాదని అంటున్నారు మరికొందరు. అయితే ఆప్షన్ ఉంచుకుని కూడా వాడుకోకపోవడం పాండ్యా ఓవర్ కాన్ఫిడెన్స్‌ని తెలియచేస్తుందని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.. 

click me!

Recommended Stories