రింకూ సింగ్ సక్సెస్ వెనక సురేష్ రైనా... క్రికెట్ కిట్స్‌ స్పాన్సర్ చేసి, సొంత ఖర్చులతో ఆ టీమ్‌‌కి ఆడించి...

Published : Apr 17, 2023, 10:53 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ప్లేయర్ రింకూ సింగ్. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది, సునామీ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ని ముగించిన రింకూ సింగ్, ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ అయిపోయాడు...                 

PREV
19
రింకూ సింగ్ సక్సెస్ వెనక సురేష్ రైనా... క్రికెట్ కిట్స్‌ స్పాన్సర్ చేసి, సొంత ఖర్చులతో ఆ టీమ్‌‌కి ఆడించి...

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు చేసిన రింకూ సింగ్, తాను ఎదుర్కొన్న ఆఖరి 7 బంతుల్లో 6 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 40 పరుగులు చేశాడు. గత ఏడాది తుది జట్టులో వరుస అవకాశాలు దక్కించుకుని, మెరుపులు మెరిపించిన రింకూ సింగ్, ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు...

29
(PTI Photo/Swapan Mahapatra) (PTI04_06_2023_000300B)

ఆ ఇన్నింగ్స్ ఏదో గాలివాటుగా వచ్చింది కాదు. అంతకుముందు ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 2 ఫోర్లు,  3 సిక్సర్లతో 46 పరుగులు చేసిన రింకూ సింగ్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 పరుగులు చేసి ఆఖరి వరకూ పోరాడాడు..

39
Image credit: PTI

కార్తీక్ త్యాగి వంటి కొందరు కుర్రాళ్లకు మెంటర్‌గా వ్యవహరించి, ఐపీఎల్‌లో రాణించడానికి గైడెన్స్ ఇచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్, ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా, రింకూ సింగ్‌ క్రికెటర్‌గా ఎదగడానికి ఎంతగానో సాయం చేశాడట. సురేష్ రైనా సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కి చెందిన రింకూ సింగ్ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు..

49
(PTI Photo/Swapan Mahapatra)(PTI04_03_2023_000213B)

ఐదు సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్నా, రింకూ సింగ్ మొదటి 4 సీజన్లలో ఆడింది పట్టుమని 10 మ్యాచులే. అందులో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది 8 మ్యాచుల్లో... గత ఏడాది రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  ఫీల్డింగ్‌లో కళ్లు చెదిరే క్యాచులు అందుకున్న రింకూ సింగ్, బ్యాటింగ్‌లో 42 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు... ఆ మ్యాచ్ తర్వాత రింకూకి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి.

59

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ఏరియాలో జన్మించిన రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ర, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఇంటింటికీ సరాఫరా చేస్తుంటారు... రింకూ సింగ్ అన్న ఓ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీళ్లంతా కలిసి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ డిస్టిబ్యూషన్ కంపెనీ క్వార్టర్స్‌‌లో ఓ రెండు గదుల్లో ఉండేవాళ్లు...

69
(PTI Photo/Swapan Mahapatra) (PTI04_06_2023_000334B)

పెద్దగా చదువు అబ్బకపోవడంతో 9వ తరగతి ఫెయిల్ అయిన రింకూ సింగ్‌కి స్వీపర్ జాబ్ వచ్చింది. తన జీవితాలను మార్చేసే శక్తి క్రికెట్‌కి ఉందని నమ్మిన రింకూ సింగ్, ఆటపైనే పూర్తి ఫోకస్ పెట్టాడు... అయితే క్రికెట్ ఆడాలనే తపన, టాలెంట్ ఉంటే సరిపోదు... క్రికెట్ కిట్స్ కొనడానికి, ఇతరత్రా ఖర్చులకు డబ్బులు కూడా కావాలి...
 

79

పెద్దగా చదువు అబ్బకపోవడంతో 9వ తరగతి ఫెయిల్ అయిన రింకూ సింగ్‌కి స్వీపర్ జాబ్ వచ్చింది. తన జీవితాలను మార్చేసే శక్తి క్రికెట్‌కి ఉందని నమ్మిన రింకూ సింగ్, ఆటపైనే పూర్తి ఫోకస్ పెట్టాడు... అయితే క్రికెట్ ఆడాలనే తపన, టాలెంట్ ఉంటే సరిపోదు... క్రికెట్ కిట్స్ కొనడానికి, ఇతరత్రా ఖర్చులకు డబ్బులు కూడా కావాలి...
 

89

ఓ క్లబ్ మ్యాచ్‌లో రింకూ సింగ్ క్రికెట్‌ని చూసి తెగ ఇంప్రెస్ అయిన సురేష్ రైనా, అతని ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. అతనికి క్రికెట్ కిట్స్ స్పాన్సర్ చేయడమే కాదు, ఉత్తరప్రదేశ్ టీమ్ తరుపున మ్యాచులు ఆడేందుకు సాయం చేశాడని సమాచారం. ఇలా రైనా సహకారంతో యూపీ టీమ్‌లోకి వచ్చిన రింకూ సింగ్, అక్కడ రాణించి ఐపీఎల్‌లో క్లిక్ అయ్యి... స్టార్ అయిపోయాడు.

99

ఐపీఎల్ 2023 సీజన్‌లో మిగిలిన మ్యాచుల్లో రింకూ సింగ్ బ్యాటు నుంచి ఇలాంటి మెరుపులు వస్తే, అతనికి టీమిండియా నుంచి పిలుపు రావడం గ్యారెంటీ అంటున్నారు మాజీ క్రికెటర్లు. రిషబ్ పంత్ గాయపడడంతో సరైన ఫినిషర్ కోసం వెతుకుతున్న టీమిండియాకి రింకూ సింగ్ ఓ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. 

click me!

Recommended Stories