కోహ్లీ, సిరాజ్, అశ్విన్, అక్షర్... ఐపీఎల్‌ అవుట్, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రిపరేషన్స్ షురూ...

First Published May 22, 2023, 1:13 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ గ్రూప్ మ్యాచులు ముగిశాయి. 10 ఫ్రాంఛైజీలతో మొదలైన ఆటలో నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కి చేరాయి. దీంతో మిగిలిన 8 జట్లలో ఉన్న భారత టెస్టు ప్లేయర్లు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌ బయలుదేరుతున్నారు..
 

ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఉన్న విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్‌తో పాటు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌లో ఉన్న ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ కూడా త్వరలో లండన్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు...

Image credit: PTI

ఉమేశ్ యాదవ్, ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలో గాయపడ్డాడు. అతని గాయం గురించి ఇంకా పూర్తి అప్‌డేట్ రాలేదు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న ఉమేశ్ యాదవ్, పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ఇంకా 15- 20 రోజుల సమయం ఉండడంతో ఇంగ్లాండ్ బయలుదేరబోతున్నాడు..

Mohammed Siraj

ఛతేశ్వర్ పూజారా ఇప్పటికే ఇంగ్లాండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్న అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ కూడా వీలైనంత త్వరగా ఇంగ్లాండ్ చేరుకుని, అక్కడి పరిస్థితులకు అలవాటు పడేలా ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ...

ప్లేఆఫ్స్ చేరిన నాలుగు జట్లలోనే భారత ప్లేయర్లు ఎక్కువగా ఉండడం విశేషం. ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ ప్లేస్‌లో రిప్లేస్‌మెంట్‌గా ఎంపికైన ఇషాన్ కిషన్ ఉన్నారు. 
 

Image credit: PTI

అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌లో భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో పాటు ప్రధాన పేసర్ మహ్మద్ షమీ, వికెట్ కీపర్ కెఎస్ భరత్ ఉన్నారు. శ్రీకర్ భరత్ ఇప్పటిదాకా ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం టీమిండియా ఫ్యాన్స్‌ని కలవరపెట్టే విషయం..

PTI PhotoAtul Yadav)(PTI03_10_2023_000192B)

చెన్నై సూపర్ కింగ్స్‌లో అజింకా రహానే, రవీంద్ర జడేజా ఉండగా లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్ కెఎల్ రాహుల్ గాయంతో తప్పుకోవడంతో మిగిలిన టీమ్‌లో ఏ ప్లేయర్ కూడా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చోటు దక్కించుకోలేదు.

Image credit: PTI

 ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే ఆరుగురు ప్లేయర్లు, మరో వారం రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. 

click me!