ఐపీఎల్ 2023 సీజన్‌ని వరుస పరాజయాలతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్, ఊహించని విధంగా ప్లేఆఫ్స్ చేరింది. గత సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన రోహిత్ టీమ్, ఈ సారి ప్లేఆఫ్స్ చేరిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది..
జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ లేకపోయినా ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డి కాక్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వేరే టీమ్స్ తరుపున ఆడుతున్నా... కిరన్ పోలార్డ, ఐపీఎల్ నుంచి తప్పుకున్నా.. ముంబై ఇండియన్స్ బేస్ ప్రైజ్ కుర్రాళ్లతో ప్లేఆఫ్స్‌కి దూసుకొచ్చింది..
28
ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కామెరూన్ గ్రీన్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో ఛేదించి అవతల పడేసింది ముంబై ఇండియన్స్...
38
Image credit: PTI
ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీపై 6 వికెట్ల తేడాతో విజయం అందుకోవడంతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, రెండు సీజన్ల గ్యాప్ తర్వాత ప్లేఆఫ్స్ ఆడనుంది..
ఆర్‌సీబీపై 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ముంబై ఇండియన్స్ ఐకాన్ సచిన్ టెండూల్కర్...
58
Virat Kohli-Shubman Gill
‘కామెరూన్ గ్రీన్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ ముంబై ఇండియన్స్ కూడా చక్కగా బ్యాటింగ్ చేశారు... (ఫన్నీ ఎమోజీ) విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదాడు. ఒక్కొక్కరికీ ఒక్కో పద్ధతి ఉంటుంది, ఎవరి క్లాస్ వారిదే.. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లో చేరడం సంతోషంగా ఉంది. గో ముంబై...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్...
68
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, శుబ్‌మన్ గిల్ మధ్య సీక్రెట్ ప్రేమాయణం సాగుతోందని ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరూ సీక్రెట్‌లో హాలీడేస్‌కి వెళ్లినట్టు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల ద్వారా తేలింది...
78
దీంతో ముంబై ఇండియన్స్‌ని ప్లేఆఫ్స్ చేర్చి శుబ్‌మన్ గిల్, మామ సచిన్ టెండూల్కర్‌ని ఫుల్లుగా ఇంప్రెస్ చేసేశాడని, త్వరలో ఈ గిల్లుడు, మాస్టర్‌కి అల్లుడు కావడం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి..
88
అయితే సారా టెండూల్కర్‌తో బ్రేకప్ చేసుకున్న శుబ్‌మన్ గిల్, సారా ఆలీ ఖాన్‌తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడు. ఈ ఇద్దరూ డేటింగ్‌లో కూడా ఉన్నారని టాక్. దీంతో శుబ్‌మన్ గిల్, సైఫ్ ఆలీ ఖాన్ అల్లుడిగా మారతాడా, సచిన్‌కి అల్లుడిగా వెళ్తాడా? అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది..