Published : May 22, 2023, 12:46 PM ISTUpdated : May 24, 2023, 04:00 PM IST
ఐపీఎల్ 2023 సీజన్ గ్రూప్ స్టేజీలో ఆఖరి రోజు 2 మ్యాచుల్లో 3 సెంచరీలు నమోదయ్యాయి. ఈ సెంచరీలతో కలిపి ఈ సీజన్‌లో సెంచరీల సంఖ్య ఇప్పటికే 11కి చేరింది... ఐపీఎల్ చరిత్రలో ఇదే హైయెస్ట్...
గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, తాజాగా గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ చేసి... వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు అందుకున్నాడు...
29
Virat Kohli-Shubman Gill
కింగ్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేస్తే ప్రిన్స్ కూడా అతన్ని ఫాలో అయ్యాడు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైనే సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్, ఈసారి ఆర్‌సీబీ బౌలర్లను చీల్చి చెండాడుతూ 5 ఫోర్లు, 8 సిక్సర్లతో శతకాన్ని అందుకున్నాడు..
విరాట్ కోహ్లీకి ఇది ఐపీఎల్‌లో ఏడో సెంచరీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు విరాట్ కోహ్లీ. గత మ్యాచ్‌లో మొట్టమొదటి ఐపీఎల్ సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్, ఆర్‌సీబీతో మ్యాచ్‌లో రెండో శతకాన్ని అందుకున్నాడు...
49
PTI Photo/Ravi Choudhary) (PTI05_06_2023_000496B)
శుబ్‌మన్ గిల్‌ని పొగుడుతూ ట్వీట్ చేసిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీని విస్మరించడం విశేషం. ‘ఈ దేశం ఎలాంటి టాలెంట్‌ని ఉత్పత్తి చేస్తోంది... శుబ్‌మన్ గిల్.. వావ్. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు స్టన్నింగ్ సెంచరీలు. ఐపీఎల్. ఇది ఈ టోర్నీ స్టాండర్డ్స్...’ అంటూ ట్వీట్ చేశాడు సౌరవ్ గంగూలీ...
59
Virat Kohli Sourav Ganguly
శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ కంటే ముందు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసి, ఆర్‌సీబీ తరుపున ఒంటరి పోరాటం చేసిన విరాట్ కోహ్లీ గురించి సౌరవ్ గంగూలీ కనీసం ప్రస్తావించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..
69
Virat Kohli vs Sourav Ganguly
విరాట్ కోహ్లీకి, సౌరవ్ గంగూలీకి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాడు. కోహ్లీ అంటే గంగూలీకి ఇష్టం లేకనే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చినట్టు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టాడు.
79
Virat Kohli Sourav Ganguly
ఈ స్టింగ్ ఆపరేషన్ తర్వాత ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీని గుర్రుగా చూడడం, మ్యాచ్ ముగిసిన తర్వాత చేతులు కలపడానికి కూడా ఇష్టపడకపోవడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది..
89
అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీతో చేతులు కలిపాడు. హగ్ కూడా చేసుకునే ప్రయత్నం చేశాడు.
99
Image credit: PTI
ఈ సంఘటన తర్వాత ఈ ఇద్దరూ కలిసిపోయారని అనుకున్నా, తాజాగా గంగూలీ, కోహ్లీ గురించి ఒక్క ట్వీట్ చేయడానికి కూడా ఇష్టపడకపోవడంతో దాదా, విరాట్ మధ్య విబేధాలు అలాగే ఉన్నాయని స్పష్టం అవుతోంది..