ఒక్క డొమెస్టిక్ మ్యాచ్ కూడా ఆడని 19 ఏళ్ల సుయాశ్ శర్మ, ఏకంగా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇస్తానని అస్సలు ఊహించి ఉండడు. ఐపీఎల్‌లో అలా వెలుగులోకి వచ్చి ఓవర్‌నైట్ స్టార్లుగా మారిపోయిన ప్లేయర్లు ఎందరో. వారిలో కొందరు ఒకటి రెండు సీజన్ల తర్వాత మాయం అయిపోగా మరికొందరు తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుని, కోట్లు తీసుకుంటున్నారు...
సంజూ శాంసన్: ఐపీఎల్ 2012 సీజన్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, సంజూ శాంసన్‌ని రూ.8 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆడిన సంజూ శాంసన్, 2018లో తిరిగి రాయల్స్‌కి తిరిగి వచ్చాడు. సంజూ శాంసన్‌ని రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, ప్రస్తుతం అతనికి రూ.14 కోట్లు చెల్లిస్తోంది.. 11 ఏళ్లలో సంజూ పారితోషికం... 150 రెట్లు పెరిగింది...
రవీంద్ర జడేజా: 2008 సీజన్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఆ జీతం చాలా తక్కువని భావించిన జడ్డూ, వేరే టీమ్స్‌తో చర్చలు జరిపిన జడ్డూ.. బ్యాన్‌కి గురై 2010 సీజన్‌లో ఆడలేదు. ఆ తర్వాత కొచ్చి టస్కర్స్ కేరళ, గుజరాత్ లయన్స్‌కి ఆడిన జడేజా, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌లో రూ.16 కోట్లు తీసుకుంటున్నాడు. 15 సీజన్లలో జడేజా ఐపీఎల్ శాలరీ 160 రెట్లు పెరిగింది...
38
Image credit: PTI
హార్ధిక్ పాండ్యా: 2015 సీజన్‌లో హార్ధిక్ పాండ్యాని రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. 2018 తర్వాత ఏటా రూ.11 కోట్లు తీసుకున్న హార్ధిక్ పాండ్యా, ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఏటా రూ.15 కోట్లు తీసుకుంటున్నాడు. సంజూ శాంసన్ మాదిరిగానే హార్ధిక్, ఐపీఎల్ శాలరీ కూడా 8 సీజన్లలోనే 150 రెట్లు పెరిగింది...
48
KL Rahul
కెఎల్ రాహుల్: ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ టాలెంటెడ్ బ్యాటర్లలో కెఎల్ రాహుల్ ఒకడు. 2013 సీజన్‌లో ఆర్‌సీబీ, కెఎల్ రాహుల్‌ని రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. ఆర్‌సీబీ నుంచి పంజాబ్ కింగ్స్‌కి మారిన రాహుల్, ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌లో ఉన్నాడు.. రాహుల్ ప్రస్తుతం ఏటా రూ.17 కోట్లు తీసుకుంటూ... అత్యధిక శాలరీ అందుకున్న ఐపీఎల్ కెప్టెన్‌గా ఉన్నాడు..
శిఖర్ ధావన్: ఐపీఎల్ 2008 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, శిఖర్ ధావన్‌ని రూ.12 లక్షలకు కొనుగోలు చేసింది. అటు నుంచి ముంబై ఇండియన్స్‌కి, ఆ తర్వాత డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆడిన శిఖర్ ధావన్‌ని 2022 మెగా వేలంలో రూ.8 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్... 2014 నుంచి 2017 వరకూ సన్‌రైజర్స్ తరుపున రూ.12.5 కోట్లు తీసుకున్న ధావన్, ఆ తర్వాత రూ.5.25 కోట్లకు పడిపోయి, ఇప్పుడు రూ.8.25 కోట్లకు ఆడుతున్నాడు..
విరాట్ కోహ్లీ: ఐపీఎల్ చరిత్రలో 16 సీజన్లుగా ఒకే టీమ్‌కి ఆడుతున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. 2008 సీజన్‌లో కోహ్లీని రూ.12 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. 2021 సీజన్‌కి ముందు నాలుగు సీజన్ల పాటు ఏటా రూ.17 కోట్లు అందుకుని రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, ప్రస్తుతం రూ.15 కోట్లు తీసుకుంటున్నాడు...
78
Image credit: PTI
గ్లెన్ మ్యాక్స్‌వెల్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని 2012 సీజన్‌లో రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ డేర్‌డెవిల్స్. అటు నుంచి పంజాబ్ కింగ్స్‌కి వెళ్లిన మ్యాక్స్‌వెల్, ప్రస్తుతం ఆర్‌సీబీ తరుపున రూ.11 కోట్లు తీసుకుంటున్నాడు...
88
సూర్యకుమార్ యాదవ్: 2011 సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అయితే ముంబైలో ఎక్కువ మ్యాచులు ఆడని సూర్య, ఆ తర్వాత కేకేఆర్‌కి వెళ్లాడు. 2018లో ముంబై ఇండియన్స్‌లోకి తిరిగి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఏటా రూ.8 కోట్లు అందుకుంటున్నాడు..