ఐపీఎల్ 2023 తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌‌గా తుషార్ దేశ్‌పాండే... కేన్ మామ ప్లేస్‌లో సాయి సుదర్శన్...

Published : Mar 31, 2023, 10:39 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో అమలులోకి వచ్చిన కొత్త రూల్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది ఇంపాక్ట్ ప్లేయర్. తుది జట్టులో లేని 12వ ప్లేయర్‌ని మ్యాచ్ ఆరంభమైన తర్వాత టీమ్‌లోకి తీసుకొచ్చేందుకు వెసులుబాటు కల్పించే ఇంపాక్ట్ ప్లేయర్‌ని తొలి మ్యాచ్‌లోనే వాడుకున్నాయి ఇరు జట్లు...

PREV
15
ఐపీఎల్ 2023 తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌‌గా తుషార్ దేశ్‌పాండే... కేన్ మామ ప్లేస్‌లో సాయి సుదర్శన్...

తొలి ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఇరు జట్లు కూడా వాడుకోలేదు. ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుషార్ దేశ్‌పాండే రికార్డు క్రియేట్ చేశాడు. అంబటి రాయుడి స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి వచ్చాడు తుషార్ దేశ్‌పాండే...

25

ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుది జట్టులోకి వచ్చిన తుషార్ దేశ్‌పాండే, తొలి బంతికే సిక్సర్ సమర్పించాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన తొలి ఓవర్‌లో 6, 4 బాదిన వృద్ధిమాన్ సాహా 10 పరుగులు రాబట్టగా శుబ్‌మన్ గిల్ మరో ఫోర్ బాదడంతో 15 పరుగులు వచ్చేశాయి..
 

35

16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, రాజవర్థన్ హంగేర్కర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కేన్ విలియంసన్ ప్లేస్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చింది గుజరాత్ టైటాన్స్...
 

45

తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ బాదిన సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు... వాస్తవానికి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని ఆస్ట్రేలియాకి చెందిన బిగ్ బాష్ లీగ్ నుంచి పట్టుకొచ్చింది బీసీసీఐ.

55
GT vs CSK

తొలుత సయ్యద్ ముస్తాక్ ఆలీ 2023 టోర్నీలో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని ప్రయోగాత్మకంగా ఉపయోగించింది బీసీసీఐ. అక్కడ సక్సెస్ కావడంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో అమలులోకి తెచ్చింది..

click me!

Recommended Stories