బుమ్రా రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించిన ముంబై ఇండియన్స్.. మాజీ కేకేఆర్ పేసర్ కు ఛాన్స్..

Published : Mar 31, 2023, 05:04 PM IST

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన టీమ్ లలో  ఒకటిగా ఉన్న ముంబై ఇండియన్స్..  ఈసారి బుమ్రా లేకుండానే బరిలోకి దిగబోతుంది. 

PREV
15
బుమ్రా రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించిన ముంబై ఇండియన్స్.. మాజీ కేకేఆర్ పేసర్ కు ఛాన్స్..

టీమిండియా పేస్ గుర్రం  జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయంతో  ఆరు నెలల పాటు క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే.  సుమారు ఆరు నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న బుమ్రా.. ఐపీఎల్ తో పాటు  జూన్ లో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూ దూరమయ్యాడు. 

25

కాగా ఐపీఎల్  లో ముంబై ఇండియన్స్.. బుమ్రా స్థానాన్ని భర్తీ  చేసింది.  దేశవాళీలో గతంలో కేరళ, ప్రస్తుతం తమిళనాడుకు ఆడుతున్న  సందీప్ వారియర్ ను  తీసుకుంది.  గతంలో    ఈ సందీప్.. ఐదు  ఐపీఎల్ మ్యాచ్ లు కూడా ఆడాడు.  ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిథ్యం వహించాడు.   

35

తన కెరీర్ లో మొత్తంగా  68  టీ20లు ఆడిన  వారియర్..  62 వికెట్లు పడగొట్టాడు.  లిస్ట్ ‘ఎ’ క్రికెట్ లో  ఈ  త్రిసూర్ (కేరళ) బౌలర్..    69 మ్యాచ్ లు ఆడి  83 వికెట్లు తీశాడు.    

45

కాగా బుమ్రాతో పాటు  ఆసీస్ పేసర్ రిచర్డ్‌సన్  కూడా ఐపీఎల్  నుంచి గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే.  అయితే బుమ్రా రిప్లేస్మెంట్ ను ప్రకటించిన ముంబై.. ఇంకా రిచర్డ్‌సన్   స్థానాన్ని  భర్తీ చేయలేదు.   

55

బుమ్రా లేకపోవడంతో ముంబై ఇండియన్స్ ఈసారి  ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తో పాటు  రూ. 17 కోట్లు పెట్టి  దక్కించుకున్న కామెరూన్ గ్రీన్ మీద భారీ ఆశలే పెట్టుకుంది. ఏప్రిల్ 2 నుంచి ఐపీఎల్  లో ట్రోఫీ వేట మొదలుపెట్టబోయే  ముంబై బౌలింగ్ దళాన్ని  ఆర్చర్ ఎలా నడిపిస్తాడో చూడాలి. 
 

click me!

Recommended Stories