IPL 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరే జట్లు ఇవే... మొదటి మ్యాచ్‌కి ముందే ఏబీ డివిల్లియర్స్ కామెంట్...

First Published Mar 31, 2023, 6:20 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ మొదలైపోయింది. 74 మ్యాచులు, 52 రోజులు, 12 వేదికల్లో జరిగే ఐపీఎల్ 2023 సీజన్‌ విజేత ఎవరనేది మే 28న తేలిపోనుంది. ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందే ఈసారి ఎవరు కప్పు గెలవబోతున్నారు? ఏయే జట్లు ప్లేఆఫ్స్ చేరబోతున్నాయనే అంచనాలు మొదలైపోయాయి...

Image credit: RCBFacebook

ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు జట్టులో జోష్ నింపేందుకు ఆర్‌సీబీ టీమ్‌తో కలిశాడు ఏబీ డివిల్లియర్స్. ఆర్‌సీబీ కోచింగ్ టీమ్‌లో చేరిన ఏబీ డివిల్లియర్స్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరే నాలుగు జట్ల గురించి అంచనా వేశాడు. అయితే ఈ లిస్టులో ఆర్‌సీబీ మూడో స్థానంలో ఉండడం విశేషం...

‘డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా టైటిల్ రేసులో కచ్ఛితంగా నిలుస్తుంది. గత సీజన్‌లో వచ్చిన విజయం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. హార్ధిక్ పాండ్యా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి రావడం కంటే ఐదు, 6 స్థానాల్లో వస్తే బెటర్...

Latest Videos


Gujarat Titans vs Chennai Super Kings

నా వరకూ నెం.5 పొజిషన్, హార్ధిక్ పాండ్యాకి బాగా సెట్ అవుతుంది. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ దాకా వారి బ్యాటింగ్ ఆర్డర్‌ బలంగా ఉంది. వరల్డ్ క్లాస్ బౌలర్లతో గుజరాత్ టైటాన్స్ బ్యాలెన్స్‌గా ఉంది.. వారిని అడ్డుకోవడం అంత తేలికైన విషయం కాదు...

చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. గత సీజన్‌లో వాళ్ల నుంచి మంచి పర్ఫామెన్స్ రాలేదు. అది సీఎస్‌కేలో మరింత కసిని రేపుతుంది. ధోనీకి ఆఖరి సీజన్ అని ప్రచారం జరుగుతోంది. ఈసారి టైటిల్ గెలవాలని  వాళ్లు కసిగా కోరుకుంటున్నారు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2021లో నాలుగో స్థానంలో నిలిచింది, 2022 సీజన్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఆ లెక్కన ఈసారి ఆర్‌సీబీ కూడా ప్లేఆఫ్స్ చేరడం ఖాయం. 2023 సీజన్‌లో ఆర్‌సీబీ టైటిల్ గెలవాలని నేను పర్సనల్‌గా కోరుకుంటున్నా...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. వాళ్లు సైలెంట్‌గా వచ్చి చేయాల్సినంత డ్యామేజ్ చేసి వెళ్తారు. నా అంచనా ప్రకారం హైదరాబాద్ కూడా కచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆర్‌సీబీ మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్.. 

click me!