ఇన్‌స్టాలో ఈ క్రికెటర్ల భార్యలకుండే క్రేజ్‌ను చూస్తే పిచ్చెక్కాల్సిందే.. టాప్-5లో ఎవరంటే..!

Published : Apr 28, 2023, 08:05 PM IST

IPL 2023: టీమిండియా క్రికెటర్ల భార్యల గురించి  ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ నుంచి  యుజ్వేంద్ర చాహల్ భార్య వరకూ అందరూ సుపరిచితులే. 

PREV
111
ఇన్‌స్టాలో ఈ క్రికెటర్ల భార్యలకుండే క్రేజ్‌ను చూస్తే పిచ్చెక్కాల్సిందే.. టాప్-5లో ఎవరంటే..!
Image credit: PTI

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్  ఇన్‌స్టాగ్రామ్ లో అత్యంత ఫాలోవర్లు కలిగిన  స్టార్  ఇండియన్ బ్యాటర్  విరాట్ కోహ్లీ.  ఇన్‌స్టాలో కోహ్లీ పెట్టే పోస్టులకు  కోట్లలో  ఛార్జ్ చేస్తాడు.  మరి మన క్రికెటర్ల భార్యలు కూడా ఇన్‌స్టాలో ఫేమసే.  ఈ జాబితాలో టాప్ -10లో ఎవరున్నారో చూద్దాం. 

211
Anushka Sharma

1. అనుష్క శర్మ :  కోహ్లీ వైఫ్, బాలీవుడ్  బ్యూటీ అనుష్క శర్మ ఈ జాబితాలో టాప్ లో ఉంది.  అనుష్కకు  ఇన్‌స్టాలో 6.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.  పెళ్లి కాకముందే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన  అనుష్క.. తర్వాత చిత్రాలు తగ్గించినా  కోహ్లీ ఎక్కడికెళ్లినా అక్కడికి వస్తూ అభిమానులతో టచ్ లోనే ఉంటున్నది. 

311

2. ధనశ్రీవర్మ : యుజ్వేంద్ర చాహల్  భార్య ధనశ్రీ గురించి  ప్రత్యేకంగా  పరిచయం అక్కర్లేదు.  పెళ్లికాకముందు  డాన్సర్ గా తన వీడియోలతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ  యూట్యూబర్ తర్వాత  కాస్త  గ్లామర్ డోస్ ను పెంచి   రచ్చ చేస్తున్నది. ధనశ్రీకి  ఇన్‌స్టా లో 54 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

411

3. సాక్షి ధోని :  టీమిండియా మాజీ సారథి ధోని భార్య  సాక్షి ధోనికి ఇన్‌స్టా లో 49 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ధోనికి మళ్లే   సాక్షి కూడా నెట్టింట పెద్దగా  అప్డేట్స్ ఇవ్వకపోయినా ఆమెకు  ఫాలోవర్లు భారీగానే ఉన్నారు. 

511

4. అతియాశెట్టి : టీమిండియా  స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ భార్య అతియా శెట్టికి ఇన్‌స్టా లో 44 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.  సునీల్ శెట్టి కూతురిగా  పరిచయమైన  ఆమె.. సినిమాల ద్వారా కంటే రాహుల్ గర్ల్‌ప్రెండ్ గానే అందరికీ సుపరిచతం. ఈ ఇద్దరూ కొద్దిరోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. 

611

5. నటాషా స్టాన్కోవిచ్ : హార్ధిక్ పాండ్యా వైఫ్ స్టాన్కోవిచ్ కు ఇన్‌స్టాలో 36 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మోడల్ గా జీవితం ఆరంభించి  హార్ధిక్ తో రెండేండ్ల పాటు లవ్ ఎఫైర్ నడిపి,  సహాజీవనం చేసి ఓ అబ్బాయిని కని ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. అందాలు ఆరబోయడంలో మిగతా క్రికెటర్ల భార్యల కంటే  నటాషా రెండాకులు ఎక్కువే చదివింది. 

711

6. రితికా : టీమిండియా సారథి రోహిత్ శర్మ ద భార్య రితికా సజ్దే కు  ఇన్‌స్టా లో  22 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాస్త పద్ధతిగానే కనిపించే రితికా.. తన కూతురుకు సంబంధించిన ఫోస్టులతో అలరిస్తుంటుంది. 

811

7. సంజనా గణేషన్ :  భారత జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య  సంజనా మ్యాచ్ ప్రెజంటర్ గా చేసే హంగామా అంతా ఇంతా కాదు. మైక్ పట్టిందంటే గలగలా మాట్లాడుతూ సందడి చేసే సంజనాకు ఇన్‌స్టా లో 9.25 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. గత కొంతకాలంగా  సంజనా కూడా  గ్లామర్ డోసును పెంచుతోంది. 

911

8.  దీపికా పల్లికల్ : ఆర్సీబీ వెటరన్ వికెట్ కీపర్  దినేశ్ కార్తీక్  భార్య, భారత స్క్వాష్  ప్లేయర్ దీపికా పల్లికల్ కు ఇన్‌స్టా లో 5.44 లక్షల మంది  ఫాలోవర్లు ఉన్నారు. 

1011

9.  క్యాండీస్ వార్నర్ : ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ భార్య క్యాండీస్ కూడా అందరికీ సుపరిచితమే. వార్నర్ తో కలిసి రీల్స్, టిక్ టాక్ వీడియోలే గాక ఈమె బీచ్ లలో ఘాటు ఫోజులతో  కుర్రకారులో సెగలు రేపడంలో ఎక్స్‌పర్టే. 

1111

10. జయా భరద్వాజ్ :   చెన్నై సూపర్ కింగ్స్  పేసర్ దీపక్ చాహర్ భార్య  జయా భరద్వాజ్. ఇన్‌స్టా లో ఆమెకు 1.87 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఈ జంట గతేడాది జూన్  లో పెళ్లి చేసుకున్న విషయం విధితమే.

click me!

Recommended Stories