కేకేఆర్‌కు బ్యాడ్ న్యూస్.. స్వదేశానికి వెళ్లిపోయిన ఓపెనింగ్ బ్యాటర్.. మళ్లీ వచ్చేది డౌటే..!

Published : Apr 28, 2023, 05:51 PM IST

IPL 2023: ఐపీఎల్-16లో ఆడిన 8 మ్యాచ్ లలో మూడు మాత్రమే గెలిచి  ప్లేఆఫ్స్  ఆశలు కోల్పోయే దశలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ కు మరో షాక్ తాకింది. 

PREV
16
కేకేఆర్‌కు బ్యాడ్ న్యూస్.. స్వదేశానికి వెళ్లిపోయిన ఓపెనింగ్ బ్యాటర్.. మళ్లీ వచ్చేది డౌటే..!

ఐపీఎల్-2023 ఎడిషన్ లో సరైన ఓపెనింగ్ జోడీ లేక చతికిలపడుతున్న  కోల్కతా నైట్ రైడర్స్ కు కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఆడిన 8 మ్యాచ్ లలో ఆ జట్టు  ఓపెనింగ్ సమస్యను ఎదుర్కుంటున్న వేళ  కేకేఆర్   ఓపెనర్ లిటన్ దాస్  టీమ్ నుంచి  అర్థాంతరంగా వెళ్లిపోయాడు. 

26

ఈ బంగ్లాదేశ్ ఓపెనర్ ఈ సీజన్ లో వచ్చిందే  కేకేఆర్ నాలుగు మ్యాచ్ లు ఆడిన తర్వాత..  అదీగాక ఒక్కటే మ్యాచ్ లో ఆడాడు. అందులో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.   ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో లిటన్ దాస్..  నాలుగు బంతులు ఆడి  నాలుగు పరుగులే చేసి  ఔటయ్యాడు. 

36

కాగా తాజాగా  ఆర్సీబీతో మ్యాచ్ గెలిచి జోష్ లో ఉన్న  కేకేఆర్..  రేపు ఈడెన్ గార్డెన్ లో   గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు ముందే దాస్.. కేకేఆర్ టీమ్ క్యాంప్ ను వీడాడు.  ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా  అతడు హుటాహుటిన  ఢాకాకు వెళ్లినట్టు  టీమ్ వర్గాలు తెలిపాయి. 

46

అయితే  బంగ్లాదేశ్ కు వెళ్లిన  దాస్ తిరిగొస్తాడా..? లేదా..? అన్నదానిమీద స్పష్టత లేదు.  వాస్తవానికి  బంగ్లా జట్టు  మే 9 నుంచి 14 వరకూ  ఐర్లాండ్ టూర్ కు వెళ్లనుంది. ఇక్కడ ఐర్లాండ్ తో కలిసి మూడు వన్డేలు ఆడనుంది. ఈ కమిట్మెంట్స్ వల్లే  బంగ్లా ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ ఐపీఎల్ - 16 ఆడలేదు. 

56
Image credit: Getty

మరి  లిటన్ దాస్ కూడా  నిజంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్ వల్లే వెళ్లాడా..?  లేక ఇక్కడున్నా పెద్దగా అవకాశాలు రావడం లేదని  వెళ్లిపోయాడా..?అనేది స్పష్టత లేదు. లిటన్ దాస్ ఎప్పుడు తిరిగొస్తాడనేదానిపై ఇప్పటికైతే స్పష్టత లేదని స్వయంగా కేకేఆర్ టీమ్ వర్గాలే తెలిపాయి. దీనిని బట్టి చూస్తే  అతడు  తిరిగి కేకేఆర్ తో కలవడం కష్టమేనని అనిపిస్తోంది.  

66

దాస్ ను ఒక్క మ్యాచ్ లోనే ఆడించిన  కేకేఆర్.. జేసన్ రాయ్ కు మాత్రం వరుసగా అవకాశాలిస్తోంది. ఈ విధ్వంసక ఆటగాడు తన మెరుపులతో  అలరిస్తున్నాడు.   ఢిల్లీతో ఆకట్టుకున్న  రాయ్.. మొన్న   ఆర్సీబీతో మ్యాచ్ లో కూడా  29 బంతుల్లోనే  4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో  56 పరుగులు చేసి ఆ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

click me!

Recommended Stories