ఫలితాలు మన ప్రతిభకు కొలమానం కాదు.. గవాస్కర్‌కు కౌంటరిచ్చిన రాయుడు.. గుంటూరు మిర్చికి ఘాటెక్కువే మరి..

Published : Apr 28, 2023, 06:16 PM IST

IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాటర్  అంబటి రాయుడుపై  సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలకు గాను ఈ  గుంటూరు ప్లేయర్  కాస్త ఘాటుగానే స్పందించాడు. 

PREV
16
ఫలితాలు మన ప్రతిభకు కొలమానం కాదు.. గవాస్కర్‌కు కౌంటరిచ్చిన రాయుడు.. గుంటూరు మిర్చికి ఘాటెక్కువే మరి..

ఐపీఎల్-16లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు.. గురువారం రాజస్తాన్ రాయల్స్ తో  నిన్న  జైపూర్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో కూడా విఫలమయ్యాడు అశ్విన్ వేసిన 11వ ఓవర్లో  రెండో బాల్ కే  అజింక్యా రహానే ఔట్ కాగా మరో రెండు బంతులకే రాయుడు కూడా భారీ షాట్ ఆడి  పెవిలియన్ చేరాడు. 

26

రాయుడు వరుసగా విఫలమువుతున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజం  సునీల్ గవాస్కర్.. అతడి ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాయుడు ఎలాగూ ఫీల్డింగ్ చేయడం లేదని, ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్న  రాయుడు అది కూడా ఆడకుంటే ఎలా అని ప్రశ్నించాడు. 

36

గవాస్కర్ మాట్లాడుతూ.. ‘నువ్వు  ఫీల్డింగ్ చేయాలి.  క్రీజులోకి రాగానే హిట్టింగ్ కు దిగడం మంచిది కాదు.  రాయుడు మాదిరిగానే పృథ్వీ షా  కూడా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఇద్దరూ  ఇంపాక్ట్ ప్లేయర్లుగా వస్తున్నవాళ్లే. వీళ్లు ఫీల్డింగ్  చేయరు. బ్యాట్ తో కూడా రాణించడం లేదు..’ అని అన్నాడు. 

46

ఈ వ్యాఖ్యలకు రాయుడు  హర్ట్ అయ్యాడో ఏమో గానీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘జీవితంలో, క్రీడలలో   ఎత్తుపల్లాలు సహజం. ఈ విషయంలో మనం  పాజిటివ్ గా ఉండాలి.  మరింత శ్రమిస్తూ ముందుకు సాగాలి.   ఫలితాలు మన ప్రతిభకు కొలమానం కాదు.  కావున  ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఈ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేయండి..’ అని రాసుకొచ్చాడు. ఇందులో రాయుడు గవాస్కర్  పేరు ఎత్తకపోయినా అతడి వ్యాఖ్యలకు కౌంటర్ గానే ట్వీట్ చేశాడని  కామెంట్స్ చేస్తున్నారు. 

56

ఇటీవల రాయుడు  రాజకీయాల గురించి ట్విటర్ లో మాట్లాడుతుండటం.. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి  పోటీ చేయనున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో  పలువురు అతడి ట్వీట్స్ కు రాజకీయ రంగు పులుముతున్నారు. రాయుడు ట్వీట్ కు కౌంటర్ ఇస్తూ ఒక నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు.  ‘కానీ నీ జీవితం మాత్రం  ఎల్లప్పుడూ ఓటమిదిశగానే  వెళ్తుంది. ఎందుకంటే నీది పీత బుర్ర కాబట్టి.. నువ్వు జీవితంలో ఎదగలేవు..’అని  ఓ పవన్ కళ్యాణ్ అభిమాని  ట్వీట్ చేశాడు. మరొక  నెటిజన్.. ‘నువ్వు ఫామ్ లోకి రావాలంటే  ఐపీఎల్ అయిపోయేదాకా ట్విటర్ కు దూరంగా ఉంటే మంచిది’అని  ట్వీట్ చేశాడు. 

66

ఇక ఈ  సీజన్ లో రాయుడు చాలావరకు ఇంపాక్ట్ ప్లేయర్ గానే బరిలోకి దిగుతున్నాడు. చెన్నై అతడిని ప్యూర్ బ్యాటర్ గా మాత్రమే వాడుతోంది.   కానీ దానికి కూడా రాయుడు న్యాయం చేయలేకపోతున్నాడు.  ఈ సీజన్ లో ఇప్పటివరకు 8 మ్యాచ్ లలో  8 ఇన్నింగ్స్ లలోనూ బ్యాటింగ్ కు వచ్చి  16.60 సగటుతో 83 పరుగులు మాత్రమే చేశాడు.  14 ఏండ్ల రాయుడి ఐపీఎల్ కెరీర్ లో ఇంత తక్కువ  సగటు నమోదవడం ఇదే ప్రథమం. 

click me!

Recommended Stories