IPL 2023: ఒక్క ఓవర్లో ఐదు సిక్సర్లు.. బాధితులు వీళ్లే..

Published : May 13, 2023, 10:21 PM IST

IPL 2023, SRH vs LSG: ఐపీఎల్‌లో   ఒక బౌలర్ ఒక ఓవర్లో   అత్యధిక పరుగులిచ్చిన రోజును అంత ఈజీగా మరిచిపోడు.  అది చాలా  రోజుల పాటు వారిని వెంటాడుతుంది.  

PREV
17
IPL 2023: ఒక్క ఓవర్లో  ఐదు సిక్సర్లు.. బాధితులు వీళ్లే..

ఐపీఎల్-16లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ - లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో  ఎస్ఆర్‌‌హెచ్  పార్ట్‌టైమ్ స్పిన్నర్  అభిషేక్ శర్మ.. ఐదు సిక్సర్లు ఇచ్చి  హైదరాబాద్ ఓటమికి  లక్నో గెలుపునకు కారణమయ్యాడు.  అభిషేక్ వేసిన  16వ ఓవర్లో స్టోయినిస్ రెండు, పూరన్ లు మూడు సిక్సర్లు బాది 30 (వైడ్ తో కలిపి 31) పిండుకున్నారు. అభిషేక్ మాదిరిగానే  ఒక ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చిన  బౌలర్లెవరో ఇక్కడ  చూద్దాం. 

27

రాహుల్ శర్మ..  పూణె వారియర్స్  తరఫున ఆడిన రాహుల్ శర్మ  2012లో   ఆర్సీబీతో మ్యాచ్ లో భాగంగా ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో  క్రిస్ గేల్ వీరబాదుడుతో  ఐదు సిక్సర్లు ఇచ్చాడు.  

37

షెల్డన్ కాట్రెల్..  పంజాబ్  వర్సెస్ రాజస్తాన్ మధ్య  2020 సీజన్ లో జరిగిన మ్యాచ్ లో భాగంగా   పంజాబ్ బౌలర్ షెల్డన్ కాట్రెల్  వేసిన ఓవర్లో  అప్పుడు రాజస్తాన్ కు ఆడిన రాహుల్ తెవాటియా వరుసగా ఐదు బంతుల్లో సిక్సర్లు బాదాడు. 

47

హర్షల్ పటేల్.. ఆర్సీబీ  బౌలర్  హర్షల్ పటేల్ కూడా ఈ  జాబితాలో బాధితుడే.  హర్షల్  2021వ సీజన్ లో చెన్నైతో  జరిగిన మ్యాచ్ లో  ఐదు సిక్సర్లు ఇచ్చుకున్నాడు. చెన్నై స్టార్ ఆల్ రౌండర్ జడ్డూ  ధాటికి  హర్షల్ బలయ్యాడు. 

57

శివమ్ మావి..  కేకేఆర్ బౌలర్ శివమ్ మావి  2002 సీజన్ లో  లక్నో బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ దెబ్బకు   ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు.  పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో   స్టోయినిస్ ధాటికి  మావికి షాక్ తప్పలేదు. 

67

యశ్ దయాల్.. ఐపీఎల్ -16   సీజన్ లో భాగంగా గుజరాత్ - కోల్కతా మధ్య  జరిగిన మ్యాచ్ లో   కేకేఆర్ విజయానికి ఆఖరి ఓవర్లో 29 పరుగులు అవసరం  కాగా రింకూ సింగ్  చివరి ఐదు బంతులను ఐదు సిక్సర్లుగా మలిచాడు.   ఈ  దెబ్బకు యశ్ దయాల్ కు జ్వరం వచ్చి మంచం పట్టాడని గుజరాత్ సారథి  హార్ధి క్ పాండ్యా కూడా చెప్పుకురావడం గమనార్హం.

77

తాజాగా హైదరాబాద్ - లక్నో మ్యాచ్ లో అభిషేక్ వేసిన  16వ ఓవర్లో   స్టోయినిస్ ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టాడు.తర్వావ బంతి వైడ్.  రెండో బాల్ మరో సిక్స్ కొట్టాడు స్టోయినిస్. కానీ మూడో బాల్ అతడు అవుట్ అయ్యాడు.  నాలుగు,  ఐదు, ఆరు బంతులను పూరన్  స్టాండ్స్  లోకి పంపాడు. 

click me!

Recommended Stories