2023 సీజన్‌ని తన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా మార్చుకుంటున్నాడు శుబ్‌మన్ గిల్. ఇప్పటికే ఈ ఏడాదిలో ఇప్పటికే టీ20, వన్డే, టెస్టుల్లో సెంచరీలు అందుకున్న శుబ్‌మన్ గిల్, వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా అందుకున్నాడు... తాజాగా ఐపీఎల్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తొలి ఐపీఎల్ సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రెండో సెంచరీ బాది ఆ టీమ్ ప్లేఆఫ్స్ ఛాన్సులపై నీళ్లు చల్లాడు..
26
తాజాగా ముంబై ఇండియన్స్‌పై మూడో సెంచరీ నమోదు చేసిన శుబ్‌మన్ గిల్, 2023 సీజన్‌లో 800+ పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో 800+లకు పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్ శుబ్‌మన్ గిల్.
36
ఇంతకుముందు 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ 976 పరుగులు చేసి, టాప్‌లో ఉంటే... ఏడేళ్లకు ఐపీఎల్‌లో 800లకు పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్..
46
Image credit: PTI
క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ని టిమ్ డేవిడ్ జారవిడిచాడు. అప్పటికి 30 పరుగులు మాత్రమే చేసిన శుబ్‌మన్ గిల్ ఆ అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటూ సీజన్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు...
తొలి వికెట్‌కి వృద్ధిమాన్ సాహాతో కలిసి 53 పరుగుల భాగస్వామ్యం జోడించిన శుబ్‌మన్ గిల్, గత మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన ఆకాశ్ మద్వాల్ బౌలింగ్‌లో 3 సిక్సర్లు బాది 21 పరుగులు రాబట్టాడు..
66
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో నాలుగో స్థానంలో ఉన్న డివాన్ కాన్వే కంటే దాదాపు 200 పరుగుల దూరంలో ఉన్నాడు శుబ్‌మన్ గిల్. ఫైనల్ మ్యాచ్‌లో కాన్వే సెంచరీ చేసినా గిల్, ఆరెంజ్ క్యాప్ గెలవడం దాదాపు ఖాయమే..