రోహిత్ ఉన్నా లేకున్నా, 2024 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఉండాల్సిందే... - సునీల్ గవాస్కర్

First Published | May 26, 2023, 8:17 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా పొట్టి ఫార్మాట్‌కి దూరంగా ఉన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ఇద్దరినీ టీ20లకు దూరం చేసిన బీసీసీఐ, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపైనే ఫోకస్ పెట్టాల్సిందిగా సూచించింది..

2024 టీ20 వరల్డ్ కప్ సమయానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 35+ వయసు దాటేస్తారు. దీంతో ఆ వయసులో టీ20ల్లో కొనసాగడం కష్టమనే ఉద్దేశంతో సీనియర్లను పొట్టి ఫార్మాట్‌కి దూరంగా పెట్టింది బీసీసీఐ...

ఐపీఎల్ 2023 సీజన్‌లో రోహిత్ శర్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం అదరగొట్టాడు. 14 మ్యాచుల్లో 639 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 3లో నిలిచాడు. సీజన్‌లో 6 హాఫ్ సెంచరీలు, రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసి రికార్డులు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...


ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ 6 సెంచరీల రికార్డును అధిగమించేసిన విరాట్ కోహ్లీ, 7 శతకాలతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. కోహ్లీ ఫామ్‌తో అతన్ని టీ20ల్లో మళ్లీ ఆడించాలనే డిమాండ్ వినబడుతోంది...

Virat Kohli

‘2024లో టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో మరోసారి ఐపీఎల్ జరుగుతుంది. అప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఇదే ఫామ్ కొనసాగిస్తే, అతనికి టీ20 వరల్డ్ కప్‌లో చోటు ఉండి తీరాల్సిందే...

PTI PhotoShailendra Bhojak)(PTI05_21_2023_000407B)

ఇప్పటి నుంచే విరాట్ కోహ్లీని టీ20ల్లో ఆడించాలని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఉంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉంది. టెస్టు సిరీస్‌లు ఆడబోతున్నారు. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ చాలా అవసరం..

Virat Kohli

జూన్‌లో టీ20 సిరీస్ ఆడబోతోంది టీమిండియా. ఇప్పుడు అతను ఉన్న ఫామ్‌కి విరాట్ ఏ ఫార్మాట్‌లో అయినా టీమ్‌లో సెట్ అవుతాడు. అయితే వెస్టిండీస్‌లో జరిగే 2024 వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో విరాట్ లాంటి సీనియర్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది...

PTI Photo)(PTI05_18_2023_000334B)

రోహిత్ శర్మ పేలవ ఫామ్‌లో ఉన్నాడు, టీ20ల్లో మునుపటిలా ఆడలేకపోతున్నాడు. కెఎల్ రాహుల్ గాయం కారణంగా సీజన్ మొత్తం ఆడలేదు. ఆడిన మ్యాచుల్లో అతని మార్కు కనిపించలేదు. కాబట్టి రోహిత్, రాహుల్ ఉన్నా లేకున్నా విరాట్ కోహ్లీని టీ20లు ఆడించాలి..

నేను సెలక్టర్‌ని అయితే విరాట్ కోహ్లీని టీ20లకు తప్పకుండా ఎంపిక చేస్తా. అతను ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు. టీ20 క్రికెట్‌లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫిఫ్టీలు చేయడమే కష్టం, అలాంటిది వరుసగా సెంచరీలు అంటే చాలా గొప్ప విషయం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

Image credit: PTI

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన తర్వాత జూలై- ఆగస్టు నెలల్లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టు, అక్కడ ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడనుంది.  

Latest Videos

click me!