ఐపీఎల్, బీసీసీఐ కంటే ధోనీ క్రేజ్ ఎక్కువ, అందుకే అంపైర్లు భయపడ్డారు... శ్రీలంక మాజీ క్రికెటర్ కామెంట్స్...

Published : May 26, 2023, 06:23 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో జరిగిన కొన్ని సంఘటనలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, విరాట్ కోహ్లీ - నవీన్ వుల్ హక్ మధ్య గొడవ మీద పెద్ద రచ్చ జరగగా మతీశ పథిరాణా కోసం ధోనీ టైమ్‌ అవుట్‌ని పొగడించడం హాట్ టాపిక్ అయ్యింది...

PREV
15
ఐపీఎల్, బీసీసీఐ కంటే ధోనీ క్రేజ్ ఎక్కువ, అందుకే అంపైర్లు భయపడ్డారు... శ్రీలంక మాజీ క్రికెటర్ కామెంట్స్...

రూల్స్ పక్కాగా ఫాలో అవుతాడని, క్రమశిక్షణ విషయంలో పక్కగా ఉంటాడని చెప్పుకునే మహేంద్ర సింగ్ ధోనీ, ఒక్క బౌలర్ కోసం ఇలా అంపైర్లతో వాగ్వాదానికి దిగి సమయాన్ని వృథా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

25

తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ డార్ల్ హార్పర్, ఈ సంఘటన గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.  ‘మహేంద్ర సింగ్ ధోనీ సమయాన్ని వృథా చేశాడనే విషయం అందరికీ తెలుసు. అంపైర్లకు కూడా ఆ విషయం తెలిసి ఏం చేయాలో తెలియక నవ్వుతూ చూస్తూ నిలబడ్డారు..

35
Dhoni vs Jadeja

ఈ సంఘటన నన్ను తీవ్రంగా కలిచి వేస్తోంది. ఓ ధోనీ అభిమానిగా ఈ సంఘటనను నేను జీర్ణించుకోలేకపోతున్నా. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా మాహీ లాంటి వ్యక్తి వ్యవహరించడం, దాన్ని చూస్తూ అంపైర్లు ఊరుకోవడం... నాకు ఏదోలా ఉంది..

45
Dhoni Umpires

కొందరు వ్యక్తుల ఇమేజ్ క్రీడా స్ఫూర్తి కంటే, క్రీడా చట్టాల కంటే పెద్దగా ఉంటుంది. ధోనీ ఇమేజ్, పాపులారిటీ, క్రేజ్ విషయం గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్, బీసీసీఐ కూడా సరిపోవు. అందుకే అంపైర్లు కూడా ఏమీ చేయలేకపోయారు..

55

అయితే ఓ మ్యాచ్ గెలవడానికి ధోనీలాంటి వ్యక్తి ఇంతలా దిగజారడడం మాత్రం నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. మాహీ న్యాయంగా నడుచుకుని, ఈ మ్యాచ్ ఓడిపోయినా పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కాదు...’ అంటూ కామెంట్ చేశాడు శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్  డార్ల్ హార్పర్...

Read more Photos on
click me!

Recommended Stories