సెంచరీతో అరుదైన ఘనత అందుకున్న గిల్.. ఆ జాబితాలో అతడొక్కడే మిగిలాడు..

Published : May 16, 2023, 04:11 PM ISTUpdated : May 16, 2023, 04:16 PM IST

IPL 2023: ఈ ఏడాది  అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీల మోత మోగిస్తున్న  శుబ్‌మన్ గిల్.. ఐపీఎల్ లో కూడా  శతకం బాదాడు.

PREV
16
సెంచరీతో అరుదైన ఘనత అందుకున్న గిల్.. ఆ జాబితాలో అతడొక్కడే మిగిలాడు..

సన్ రైజర్స్ హైదరాబాద్ తో సోమవారం అహ్మదాబాద్ వేదికగా ముగిసిన  మ్యాచ్ లో శతకం చేసిన  గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. ఈ సెంచరీతో  పలు రికార్డులు  బ్రేక్ చేశాడు. ఐపీఎల్ లో రెండో సీజన్ ఆడుతున్న గుజరాత్ కు ఇది  ఫస్ట్ సెంచరీ కావడం విశేషం.  

26

గుజరాత్ కు ఇదివరకు  13 మ్యాచ్ లు ఆడిన గిల్.. వెయ్యి పరుగులు కూడా పూర్తి చేశాడు. 29 ఇన్నింగ్స్ లలో గిలత్.. 1,059 పరుగులు చేశాడు.  ఈ క్రమంలో అతడి సగటు 40.73 గా ఉండగా  స్ట్రైక్ రేట్   139.53గా ఉంది. ఇందులో 8 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉంది. 

36

కాగా   హైదరాబాద్ తో సెంచరీ చేయడంతో గిల్.. టీమిండియా తరఫున అంతర్జాతీయ  స్థాయిలో శతకం బాది ఈ లీగ్ లో కూడా మూడంకెల  స్కోరు చేసిన   ఆరో బ్యాటర్ గా నిలిచాడు. 

46

భారత్ తరఫున  రోహిత్ శర్మ, సురేశ్ రైనా,  విరాట్ కోహ్లీ,  సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, దీపక్ హుడాలు  అంతర్జాతీయ స్థాయిలో టీ20 సెంచరీలు చేశారు. వీరిలో  దీపక్ హుడా మినహా మిగిలినవారంతా  ఇంటర్నేషనల్ టీ20లతో  పాటు   ఐపీఎల్ లో కూడా శతకాలు బాదారు.  

56

తాజా సెంచరీతో గిల్.. ఒకే క్యాలెండర్ ఈయర్ లో వన్డేలు, టెస్టులు, టీ20లతో పాటు  ఐపీఎల్ లో కూడా సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో   గిల్.. శ్రీలంక, న్యూజిలాండ్ పై వన్డేలు, టీ20లలో సెంచరీలు చేయగా ఆస్ట్రేలియాతో  టెస్టు  లో కూడా సెంచరీ సాధించాడు. 

66

గిల్  సెంచరీతో నిన్నటి మ్యాచ్ లో  గుజరాత్  టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో  9 వికెట్ల నష్టానికి  188 పరుగులు చేసింది.  లక్ష్య ఛేదనలో  49కే ఆరు వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్  క్లాసెన్ పోరాడటంతో  20 ఓవర్లలో  154 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గుజరాత్.. 34 పరుగుల తేడాతో గెలుపొందింది. 

Read more Photos on
click me!

Recommended Stories