ఆర్చర్ మాత్రమే కాదు ఇంగ్లాండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్ కూడా మోకాలి గాయం కారణంగా ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. ఐపీఎల్ లో అతడు రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. తర్వాత గాయం కారణంగా మళ్లీ బరిలోకి దిగలేదు. ఆర్చర్, స్టోక్స్ తర్వాత ఒలీ స్టోన్ కూడా కౌంటీ ఛాంపియన్‌షిప్ లో భాగంగా ఇటీవలే గాయపడ్డాడు.