లేక లేక గెలిచినా లెజెండ్స్ లిస్టులోకి కెఎల్ రాహుల్... జింబాబ్వేపై గెలిచి, ఏకంగా గంగూలీ, ధోనీ సరసన...

Published : Aug 18, 2022, 07:08 PM IST

కెఎల్ రాహుల్... అసలు కెప్టెన్సీ స్కిల్స్‌ ఏ పూశాన లేవని విమర్శలు ఎదుర్కొన్న కెప్టెన్. అనుకోకుండా కెప్టెన్సీ దక్కించుకుని అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్‌ని పక్కా ప్లాన్ ప్రకారం లెజెండరీ కెప్టెన్ల జాబితాలో చేర్చిపడేసింది బీసీసీఐ. జింబాబ్వే టూర్‌లో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న కెఎల్ రాహుల్, అరుదైన ఘన సాధించాడు...

PREV
18
లేక లేక గెలిచినా లెజెండ్స్ లిస్టులోకి కెఎల్ రాహుల్... జింబాబ్వేపై గెలిచి, ఏకంగా గంగూలీ, ధోనీ సరసన...
KL Rahul

టీమిండియాకి వన్డేల్లో 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందించిన 8వ కెప్టెన్ కెఎల్ రాహుల్. ఇంతకుముందు 1975లో వెంకటరాఘవన్, 1984లో సునీల్ గవాస్కర్, 1997లో సచిన్ టెండూల్కర్, 1998లో మహమ్మద్ అజారుద్దీన్ ఈ ఫీట్ సాధించారు...

28
KL Rahul

20వ శతాబ్దంలో సౌరవ్ గంగూలీ 2001లో 10 వికెట్ల తేడాతో విజయం అందుకోగా ఆ తర్వాత 10 ఏళ్లకు ఎంఎస్ ధోనీ 2016లో, రోహిత్ శర్మ 2022లో 10 వికెట్ల తేడాతో వన్డేల్లో విజయాలు అందుకున్నారు. తాజా విజయంతో కెఎల్ రాహుల్‌కి కూడా ఈ లిస్టులో చోటు దక్కింది...

38

2021 ఏడాది చివరన సౌతాఫ్రికా టూర్‌‌కి ప్రకటించిన జట్టులో వన్డేలకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు కెఎల్ రాహుల్. అయితే టూర్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మ గాయపడడంతో అతని స్థానంలో కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ...

48

టెస్టులకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ, టూర్‌కి రాకపోవడంతో కెఎల్ రాహుల్‌కి ఆ ప్రమోషన్ కూడా దక్కింది. విరాట్ కోహ్లీ మెడ నొప్పితో బాధపడడంతో రెండో టెస్టులో కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న కెఎల్ రాహుల్, భారత జట్టుకి కంచుకోటలాంటి జోహన్‌బర్గ్‌లో తొలి పరాజయాన్ని రుచి చూపించాడు...

58

ఆ తర్వాత వన్డే సిరీస్‌లో టీమిండియా మూడుకి మూడు వన్డేల్లోనూ చిత్తుగా ఓడింది. ఈ పరాజయాల తర్వాత కెఎల్ రాహుల్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ ఇవ్వడంపై బీసీసీఐని తీవ్రంగా ట్రోల్ చేశారు క్రికెట్ ఫ్యాన్స్...

68
Image credit: PTI

సరిగ్గా ఇది జరిగిన 8 నెలలకు జింబాబ్వే టూర్‌‌లో తొలి విజయం అందుకున్నాడు కెఎల్ రాహుల్. తొలుత ఈ టూర్‌కి కెప్టెన్‌గా ప్రకటించిన శిఖర్ ధావన్‌ని తప్పించి, ఆదరా బాదరాగా కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ... లేటుగా జింబాబ్వే చేరుకుని జట్టుతో కలిశాడు కెఎల్ రాహుల్...

78

ఆసియా కప్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ కోసం జింబాబ్వే వెళ్లిన కెఎల్ రాహుల్, కెప్టెన్‌గా మారడం... పసికూనలపై ఘన విజయం అందుకుని ఎలైట్ కెప్టెన్ల లిస్టులో చేరడం వెనక బీసీసీఐ పక్కా ప్లానింగ్ ఉందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... కెఎల్ రాహుల్‌ని ఫ్యూచర్ కెప్టెన్‌గా చేసేందుకు బీసీసీఐ చేస్తున్న ప్రణాళికల్లో ఇది భాగమని అంటున్నారు టీమిండియా అభిమానులు... 

88
K L Rahul

కెప్టెన్‌గా టీమిండియాకి విజయాలు అందించిన హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్‌లను పక్కనబెట్టి... కెఎల్ రాహుల్‌ని ఆసియా కప్ 2022 టోర్నీకి వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంతోనే బీసీసీఐ వ్యూహం అర్థమవుతోందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్... 

Read more Photos on
click me!

Recommended Stories