కెప్టెన్సీ బాగుంటే సరిపోదు, తెలివిగా మాట్లాడడమూ తెలియాలి... సంజూ శాంసన్ ‘నాకు తెలీదు...’ వ్యాఖ్యలపై...

Published : May 15, 2023, 02:03 PM IST

ఐపీఎల్‌లో తన కెప్టెన్సీతో ఇంప్రెస్ చేస్తున్న యంగ్ కెప్టెన్లలో సంజూ శాంసన్ ఒకడు. సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్, 2022 సీజన్‌లో ఫైనల్‌కి వెళ్లింది.. ఈసారి ఘనంగా ఆరంభించినా, ఆ తర్వాత రాయల్స్ గాడి తప్పింది.. 

PREV
19
కెప్టెన్సీ బాగుంటే సరిపోదు, తెలివిగా మాట్లాడడమూ తెలియాలి... సంజూ శాంసన్ ‘నాకు తెలీదు...’ వ్యాఖ్యలపై...
sanju samson

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి 5 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత జరిగిన 8 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకుంది...

29

కేకేఆర్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచి టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 112 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది...

39

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘నువ్వు ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే, మీరు గెలిచేవాళ్లేమో..’ అనే ప్రశ్నకు ‘ఇది చాలా గొప్ప ప్రశ్న కానీ నాకు సమాధానం తెలీదు...’ అంటూ రిప్లై ఇచ్చాడు సంజూ శాంసన్..

49

ఈ సమాధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 59 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చాడు సంజూ శాంసన్...

59
Sanju Samson

‘బ్యాటింగ్‌లో ఇంత దారుణంగా కుప్పకూలడానికి కారణం ఏంటి? ఎక్కడ తప్పు జరిగింది’ అనే ప్రశ్నకు ‘అది చాలా మంచి ప్రశ్న అయితే నాకు సమాధానం తెలీదు. ఐపీఎల్‌ లక్షణమే ఇదనుకుంటా... ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం...

69

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ ఆడుతున్నప్పుడు మాకు పవర్ ప్లేలో బాగా పరుగులు వచ్చాయి. వాళ్లిద్దరూ డకౌట్ కావడంతో పవర్ ప్లేలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయాం. అసలే ఏం జరుగుతుందో గ్రహించేలోపు చాలా నష్టం జరిగింది...
 

79

పవర్ ప్లేలో కొన్ని పరుగులు చేసి ఉంటే కచ్ఛితంగా ఆఖరి వరకూ పోరాడేవాళ్లం. అయితే ఆర్‌సీబీ బౌలర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇలాంటి ఫన్నీ విషయాలు ఐపీఎల్‌లో జరుగుతూనే ఉంటాయి..’ అంటూ కామెంట్ చేశాడు సంజూ శాంసన్..
 

89

ప్రతీసారీ ఇలా ‘అది గొప్ప ప్రశ్న అయితే నాకు సమాధానం తెలీదు’ అనే ఆన్సర్ ఇస్తుండడంతో సంజూ శాంసన్‌ని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. 

99
Image credit: PTI

ఇంత నిక్కచ్చిగా ఉంటే క్రికెట్ ఫీల్డ్‌లో నెట్టుకురాలేమని కొందరు అంటుంటే... ధోనీ, రోహిత్‌, హార్ధిక్ పాండ్యాల్లా తెలివిగా సమాధానం చెప్పడం తెలియకపోతే, కుమార సంగర్కరని ప్రెస్ మీట్‌కి పంపిస్తే బెటర్ అని అంటున్నారు ఇంకొందరు.. 

click me!

Recommended Stories