ఇప్పుడంటే బౌలింగ్ చేయడం మానేశారు కానీ ఒకప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బౌలింగ్ కూడా చేసేవాళ్లు. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో వికెట్ తీసిన భారత ఆఖరి బౌలర్ విరాట్ కోహ్లీయే...
తాజాగా ఐపీఎల్ 2023 సీజన్‌లో డూ ఆర్ డై మ్యాచ్‌లో ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్‌ని 59 పరుగులకి ఆలౌట్ చేసింది. 112 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చింది..
26
Virat Kohli
ఈ మ్యాచ్ విజయం తర్వాత ఆర్‌సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో జోష్‌లో కనిపించిన విరాట్ కోహ్లీ, ‘నేను బౌలింగ్ చేసి ఉంటే వాళ్లు 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవాళ్లు...’ అంటూ నవ్వుతూ చెప్పాడు..
36
అంతర్జాతీయ క్రికెట్‌లో 4 వికెట్లు తీసిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో కూడా 4 వికెట్లు పడగొట్టాడు. 2016 సీజన్‌లో చివరిగా బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ, ఆల్బీ మోర్కెల్ దెబ్బకి ఐపీఎల్‌లో తరుచుగా బౌలింగ్ చేయడం మానేశాడు.
46
2012లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 206 పరుగుల భారీ స్కోరు చేసింది. చివరి 2 ఓవర్లలో సీఎస్‌కే విజయానికి 43 పరుగులు కావాల్సి వచ్చాయి..
56
ఈ దశలో అప్పటి ఆర్‌సీబీ కెప్టెన్ డానియల్ విటోరీ, విరాట్ కోహ్లీకి బౌలింగ్ ఇచ్చాడు. ఆ ఓవర్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు ఆల్బీ మోర్కెల్.. ఈ ఓవర్‌తో ఆఖరి ఓవర్‌లో 15 పరుగులే కావాల్సిన స్థితికి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఈజీ విక్టరీ అందుకుంది..
66
Image credit: PTI
అంతకుముందు 2008 నుంచి 2012 వరకూ ప్రతీ సీజన్‌లో బౌలింగ్ చేస్తూ వచ్చిన విరాట్ కోహ్లీ, ఆల్బీ మోర్కెల్ దెబ్బకు 2013, 2014 సీజన్లలో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. 2015లో 2 ఓవర్లు బౌలింగ్ చేసిన కోహ్లీ, 2016లో ఒకే ఓవర్ బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చాడు..