నేనేం క్రిమినల్‌ని కాదు, నాకే ఇలా చేయడం అన్యాయం... డేవిడ్ వార్నర్ ఆవేదన...

First Published Nov 21, 2022, 3:19 PM IST

సాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా క్రికెట్‌లో రేపిన చిచ్చు... ఇప్పటికీ చల్లారలేదు. నాలుగు వన్డే వరల్డ్ కప్స్, ఓ టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టు.. సాండ్ పేపర్ వివాదం కారణంగా ఛీటర్స్‌గా ముద్రపడి, అందరి ముందూ తలదించుకోవాల్సి వచ్చింది. ఈ వివాదం నుంచి ఇప్పటికీ బయటపడలేదు అప్పటి ఆసీస్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...

Image credit: Getty

ఆరోన్ ఫించ్ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ తర్వాత ఆ బాధ్యతలు డేవిడ్ వార్నర్‌కే దక్కుతాయని అనుకున్నారంతా. అయితే సాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్‌పై లైఫ్ టైం కెప్టెన్సీ బ్యాన్ పడింది. ఈ కారణంగానే వార్నర్‌ని పక్కనబెట్టి ప్యాట్ కమ్మిన్స్‌కి వన్డే కెప్టెన్సీ అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా...

David Warner

బాల్ ట్యాంపరింగ్ వివాద సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్‌పై నిషేధం ఎత్తి వేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ ఏడాది జరిగిన యాషెస్ సిరీస్‌లో ఓ టెస్టుకి స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ కూడా చేశాడు. అయితే డేవిడ్ వార్నర్‌పై పడిన జీవితకాల కెప్టెన్సీ నిషేధం మాత్రం తీసివేయలేదు క్రికెట్ ఆస్ట్రేలియా..

David Warner-Aaron Finch

ఇప్పటికే తనపై విధించిన జీవిత కాల కెప్టెన్సీ నిషేధాన్ని తొలగించాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియాని కోరాడు డేవిడ్ వార్నర్. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం దీనిపై నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలస్యం చేస్తోంది. దీంతో డేవిడ్ వార్నర్, ఆసీస్ క్రికెట్ బోర్డు తీరుపై ఆవేదన వ్యక్తం చేశాడు...

Pat Cummins with David Warner

‘నేను క్రిమినల్‌ని కాదు. ఏదో ఒక స్టేజీ దాటిన ప్రతీ ఒక్కరికీ అప్పీలు చేసుకునే అవకాశం ఉండాలి. కొంతకాలం పాటు బ్యాన్ వేస్తే తప్పు లేదు, కానీ జీవితకాలమంతా కెప్టెన్సీ చేయకూడదనడం చాలా కఠినం.. చాలా రోజులుగా బ్యాన్ ఎత్తివేస్తారని ఎదురుచూస్తున్నా...

ఈ ఏడాది ఫ్రిబవరిలో నాపై నిషేధం ఎత్తివేస్తారని అనుకున్నా, కానీ అలా జరగలేదు. ఇది నాకూ, నా కుటుంబానికి, ఈ వివాదంలో ఇరుక్కున్న వారందరికీ చాలా కష్టంగా ఉంది. జరిగిపోయినదాన్ని ఇప్పుడు క్షుణ్ణంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఏం జరిగిందో మళ్లీ చెప్పాల్సిన పని లేదు...

ఫించ్ రిటైర్ అయిన తర్వాత నాకు కెప్టెన్సీ దక్కుతుందని ఆశించా. నాపైన వేసిన కెప్టెన్సీ బ్యాన్‌ని ఎత్తివేస్తారని అనుకున్నా. కానీ అలా జరగలేదు. 2018లో నాలుగేళ్ల క్రితం జరిగినదాన్ని సాకుగా చూపించి, ఇప్పుడు కెప్టెన్సీకి అర్హుడు కాదని చెప్పడం ఫ్రస్టేషన్‌కి గురి చేస్తోంది...’ అంటూ ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్...

click me!